స్టార్ మా చానెల్ లో ఈ సంక్రాంతికి సరికొత్త ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ వస్తున్న ఈ ప్రోగ్రామ్ మాత్రం బుల్లి తెర ప్రేక్షకులకు ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ అందించనుంది. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ అంటే యాంకర్ రవి, లాస్య. వీళ్లిద్దరు చాలాకాలం తర్వాత కలిశారు. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో చాలా షోలలో పార్టిసిపేట్ చేశారు. తర్వాత వివాదాల కారణంగా ఏ షోలో కలిసి పనిచేయలేదు. తర్వాత ఈ షోకు కలిసి యాంకరింగ్ చేశారు.

మరోవైపు స్టార్ మా సీరియళ్ల నటులు కూడా ఈ షోలో సందడి చేశారు. అలాగే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు కూడా ఈ షోలో హంగామా చేశారు. అవినాష్ అయితే తన టాలెంట్ మొత్తాన్న బయటపెట్టాడు.
నేను సింగిల్.. రెడీ టు మింగిల్ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీంతో యాంకర్ లాస్య.. సీరియస్ లీ అంటూ అరియానాను గుర్తు చేసింది. ఇంతలోనే అరియానా.. బ్యాక్ గ్రౌండ్ లో స్నేహితుడా.. స్నేహితుడా అంటూ పాట పాడుతూ వచ్చేసింది. నువ్వు సింగిలా.. సీరియస్ లీ అంటూ అవినాష్ ను ఆటపట్టించింది.
అలాగే జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. కేవలం ఆర్టిస్టులే కాకుండా.. అందరి ఫ్యామిలీ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసి.. అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ.. అంటూ ఫుల్లు టు ఎంజాయ్ చేశారు.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.