అవినాష్.. ప్రస్తుతం మనోడికి బాగానే పాపులారిటీ వచ్చేసింది. ముందు ముక్కు అవినాష్ గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్. ప్రస్తుతం స్టార్ మా చానెల్ లోనే ప్రోగ్రామ్స్ చేయడానికి అవినాష్ కు ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతానికైతే స్టార్ మా లోనే ప్రోగ్రామ్స్ చేస్తా.. తర్వాత జబర్దస్త్ కానీ.. ఇంకా వేరే ఏదైనా కామెడీ షో గురించి ఆలోచిస్తా.. అని అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు కూడా.

ఇక.. సంక్రాంతి స్పెషల్ గా స్టార్ మాలో ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అనే ప్రోగ్రామ్ ను ప్రసారం చేయనున్నారు. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఆన్ సంక్రాంతి అన్నమాట. ఈ షోకు స్టార్ మా టీవీ సీరియళ్ల నటులు, జబర్దస్త్ కంటెస్టెంట్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వచ్చి తెగ సందడి చేశారు.
బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ తన ఫ్యామిలీతో వచ్చాడు. అలాగే అవినాష్, అరియానా కూడా ఈ షోలో సందడి చేశారు. అయితే.. ఈసందర్భంగా అవినాష్.. అరియానా రాగానే.. తనకు ప్రపోజ్ చేసి తనను ఎత్తుకొని అలా కాసేపు తిప్పాడు. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం.. అరియానా మీద తనకున్న ప్రేమను ఇలా బయటపెట్టేశాడు అవినాష్.
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒక లుక్కేసుకోండి.