Jabardasth show : జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన ముక్కు అవినాష్ అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్…నాలుగో సీజన్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. సరిగ్గా టాప్ ఫైకి వెళ్లకముందు హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు నిరుత్సాహానికి గురి కావడం జరిగింది.
ముఖ్యంగా హౌస్ లో … కంటెస్టెంట్ అరియనతో… అవినాష్ చాలా క్లోజ్ కావడం.. ఇద్దరి మధ్య బెస్ట్ ఫ్రెండ్ షిప్ తరహా బాండింగ్ క్రియేట్ అవటం.. బయట కూడా కంటిన్యూ అవటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇదిలా ఉంటే అప్పట్లో బిగ్ బాస్ షో లో పాల్గొనాలి అంటే కచ్చితంగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లాలంటే 10 లక్షలు కట్టాలని …
Jabardasth show జబర్దస్త్ షో నిర్వాహకులు కోరినట్లు
జబర్దస్త్ షో నిర్వాహకులు కోరినట్లు, తన పరిస్థితి తెలిసి కూడా అనేక ఇబ్బందులు అప్పట్లో ఎదుర్కొన్నట్లు… చివరాకరికి కట్టినట్లు అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో తెలపడం జరిగింది. అంతలా ఇబ్బంది పెట్టిన జబర్దస్త్ షో పై తాజాగా అవినాష్ కసి తీర్చుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ సాధిస్తుందని అందరికీ తెలుసు. ఆ షో ప్రసారం అవుతున్న సమయంలో మిగతా ఛానల్ లో ప్రసారం అయ్యే ఈ షోకి పెద్దగా ఆదరణ ఉండదు అని చాలామంది చెబుతారు. అటువంటి జబర్దస్త్ షో పై …
ఎలాగైనా టిఆర్పి రేటింగ్ విషయంలో పై చేయి సాధించాలని నాగబాబు ఎప్పటినుండో అనుకుంటున్నా కానీ… ఆయన వల్ల కానిది అవినాష్ “స్టార్ మా” లో… ఓంకార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కామెడీ స్టార్స్” లో ఇటీవల ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ షో టిఆర్పి రేటింగ్ ను అధిగమించే రీతిలో అవినాష్ ఎపిసోడ్ రికార్డులు క్రియేట్ చేసినట్లు.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వార్త తెలుసుకుని ఎలాగైతే అవినాష్ జబర్దస్త్ పై రివెంజ్ తీర్చుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారట.