ట్రెండింగ్ న్యూస్

Mukku Avinash : అరియానా ఉంటేనే నాకు కిక్కు.. ముక్కు అవినాష్ అంతమాట అనేశాడేంటి?

avinash shocking comments on ariyana in 100 percent love show
Share

Mukku Avinash : ముక్కు అవినాష్ mukku avinash గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ముక్కు అవినాష్ ఎక్కడుంటే అక్కడ సందడే. ఆయన ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదివరకు జబర్దస్త్ లో చేసిన అనుభవంతో అవినాష్ కామెడీని చింపేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కూడా అవినాష్ చేసిన ఎంటర్ టైన్ మెంట్ మామూల్ది కాదు.

avinash shocking comments on ariyana in 100 percent love show
avinash shocking comments on ariyana in 100 percent love show

అయితే.. స్టార్ మాలో ఇటీవల 100 పర్సెంట్ లవ్ అనే ఒక షోను స్టార్ట్ చేశారు. ఈ షోలో ఎనిమిది కపుల్స్ ను పిలిచి.. వాళ్లతో కొన్ని గేమ్స్ ఆడించి.. చివరికి ఎవరు అయితే అన్ని బాగా పర్ ఫార్మ్ చేస్తారో వాళ్లకు 100 పర్సెంట్ లవ్ టైటిల్ ఇస్తారన్నమాట.

అయితే.. ఈ షోలో అవినాష్, అరియానా.. ఇద్దరూ ఓ జంటగా కలిసి ఆడారు అన్నమాట. ఇక.. వీళ్లిద్దరు కలిసి చేసిన హంగామా మాత్రం మామూలుగా లేదు. నిజానికి వీళ్లిద్దరూ ఫ్రెండ్సే కానీ.. ఆ షోకు మాత్రం కపుల్స్ గా వెళ్లారు. దీంతో అందరూ వీళ్ల మధ్య ఏదో ఉందంటూ గుసగుసలాడుకుంటున్నారు.

Mukku Avinash : స్టేజ్ మీదనే చిన్నపిల్లల్లా కొట్టుకున్న అవినాష్, అరియానా

అయితే.. షోలో భాగంగా.. ఏదో ఒక విషయంలో యాంకర్ ఓంకార్ ముందే.. అరియానా ఉంటేనే నాకు కిక్కు అంటూ అవినాష్ ఏదో అనబోయాడు. అంతే వెంటనే అరియానాకు కోపం వచ్చేసి.. అవినాష్ ను రెండు చరిచింది. తన చేతులతో అవినాష్ ను పిడి గుద్దులు గుద్దింది. దీంతో స్టేజ్ మీద ఉన్న వాళ్లు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు.

100 పర్సెంట్ లవ్.. పార్ట్ 2 షో ఈనెల 28న సాయంత్రం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ప్రోమోపై ఓ లుక్కేయండి.


Share

Related posts

కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. నేడు, రేపు రాత్రి కర్ఫ్యూ..! ఎక్కడంటే..?

somaraju sharma

నేను అనర్హుడిని : ఇమ్రాన్

sarath

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేవు!! ఆ ఉత్తర్వుల అంతరార్థం అదే!

Yandamuri