Baba Bhaskar : బాబా భాస్కర్ తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికంటే ముందు బాబా భాస్కర్ పెద్ద కొరియోగ్రాఫర్. తెలుగు, తమిళంలో టాప్ కొరియోగ్రాఫర్ గా బాబా భాస్కర్ పాపులర్ అయ్యారు. కానీ… ఎప్పుడైతే బాబా భాస్కర్ కు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చిందో… అప్పుడే ఆయన రేంజ్ మారిపోయింది. బాబా భాస్కర్ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు.

బాబా భాస్కర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే. సీరియస్ గా ఉండటం, బాధగా ఉండటం ఆయనకు నచ్చదు. ఎంటర్ టైన్ మెంట్ కు బాబా భాస్కర్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో కూడా అంతే. బాబా భాస్కర్ ఎప్పుడూ అందరితో సరదాగా ఉండేవారు. అందరినీ నవ్వించేవారు. అందుకే… బాబా భాస్కర్ అందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అయ్యారు.
Baba Bhaskar : ఓంకార్ అన్నయ్య చెబుతున్నా వినకుండా షర్ట్ విప్పేసిన బాబా భాస్కర్
బాబా భాస్కర్ ప్రస్తుతం స్టార్ మాలో వచ్చే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేస్తూ తన షర్ట్ విప్పేసి… తన సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. దీంతో బాబా భాస్కర్ కూడా వెంటనే స్టేజ్ మీదికి వచ్చి తన షర్ట్ విప్పేసి.. తన సిక్స్ ప్యాక్ ను కూడా చూపించాడు. తర్వాత ఓంకార్ అన్నయ్య దగ్గరికి వెళ్లి… తాను షర్ట్ విప్పింది కట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ… ఓంకర్ అన్నయ్య మాత్రం… మాస్టారు… ఇదే ప్రోమో.. ఫిక్స్ అయిపోండి.. అనగానే బాబా భాస్కర్ ఫీజులు ఎగిరిపోయాయి.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా బాబా భాస్కర్ సిక్స్ ప్యాక్ ను చూసేయండి.