Baba Ramdev: ఇంతలో ఎంత మార్పు? అల్లోపతి వైద్యులు దైవ దూత లంటూ యోగాగురు ప్రశంసలు!కరోనావ్యాక్సిన్ వేయించుకుంటానని ప్రకటన!!

Share

Baba Ramdev: అల్లోపతి వైద్యంపైన, ఆకోవకు చెందిన డాక్టర్లపైనా అవాకులు చవాకులు పేలిన యోగా గురు బాబా రాందేవ్ నాలుక మడతేశారు ఆధునిక హంతకులంటూ అల్లోపతి వైద్యుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాందేవ్ అదే నోటితో వైద్యులు దైవదూతలు లాంటి వారంటూ ప్రశంసించడం విశేషం.తన పోరాటం వైద్యుల మీద కాదని,మెడికల్ మాఫియా మీదని ఆయన సమర్థించుకున్నారు.కొద్దిగా వెనక్కు వెళితే..

Baba Ramdev praises Allopathy Doctors
Baba Ramdev praises Allopathy Doctors

వివాదం ఎలా మొదలైందంటే?

యోగా గురు బాబా రామ్దేవ్ ముందుగా కరోనా చికిత్సకు వాడుతున్న ఇంజెక్షన్ల మీద విమర్శల దాడి చేశారు. అవేవీ పని చేయవని పేర్కొన్నారు.అల్లోపతి వైద్యులను కూడా ఆయన విడిచిపెట్టలేదు.వారు ఆధునిక హంతకులంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు.ఐఎంఏ దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కి ఫిర్యాదు చేయగా ఆయన జోక్యం చేసుకొని రామ్దేవ్ చేత ఆ వ్యాఖ్యలను ఉపసంహరింపజేశారు.

సీన్ కట్ చేస్తే!

మళ్లీ ఆ పక్కరోజే రామ్దేవ్ స్వరాన్ని సవరించుకున్నారు. యథావిధిగా అల్లోపతి వైద్యాని దుయ్యబట్టారు.అల్లోపతి వైద్యులకు ఇరవై అయిదు ప్రశ్నలు వేశారు.ఆయన ధోరణిలో మార్పేమీ లేకపోవడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసు పంపింది.ఆయన మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. ఐఎంఎ వైద్యులు బ్లాక్ డే కూడా పాటించారు.ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఐఎంఎ ఘాటుగా లేఖ రాసింది.ఆయనపై దేశద్రోహం నేరం కింద కేసు పెట్టాలన్నది ఐఎంఏ డిమాండ్. అంతటితో ఆగకుండా రామ్దేవ్ ను ఐఎంఏ బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించింది.కాగా ఐఎంఏ దాఖలు చేసిన పిటిషన్ మీద ఈనెల పదమూడో తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనున్న నేపధ్యంలో యోగా గురు రామ్ దేవ్ దిగివచ్చినట్లు కన్పిస్తుంది.

Baba Ramdev: ఇవీ రామ్ దేవ్ తాజా వ్యాఖ్యలు!

శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని స్ప‌ష్టం చేశారు.ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉన్న‌ట్టు రాందేవ్ గుర్తు చేశారు. మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని  ఆయన కోరారు.

కొసమెరుపు!

గతంలో కరోనా వ్యాక్సిన్ వేస్టని, తాను యోగా చేస్తాను కాబట్టి తనకు వ్యాక్సిన్ అవసరం లేదని ప్రకటించిన యోగాగురు ..ఇప్పుడు తాను కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటానని చెప్పడం కొసమెరుపు.అంతేగాకుండా ప్రతి దేశ పౌరుడు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునివ్వటం ఇంకా విశేషం.పనిలో పనిగా కరోనా నియంత్రణకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న కృషిని రామ్దేవ్ విపరీతంగా ప్రశంసించారు.ఇంతటితో ఈ వివాదానికి తెర పడుతుందేమో చూడాలి.

 


Share

Related posts

పవన్ వ్యవహారశైలిపై సొంత క్యాడర్ లోనే అసహనం..??

sekhar

బిగ్ న్యూస్ :ఆంధ్రలో అతి పెద్ద స్కామ్.. తెలంగాణలో సీక్రెట్ విచారణ !

somaraju sharma

24న హస్తినకు తెలంగాణ సీఎం

Siva Prasad