NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ప‌డేసిన‌ స్క్రాఫ్‌ అంతా నెత్తిమీద వేసుకుంటోన్న బాబు, ప‌వ‌న్‌…?

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా పోయేకాలం దగ్గర పడిందన్న కామెంట్లు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. ఐదేళ్లపాటు ఎన్నో అష్టా కష్టాలు పడి పార్టీని నిలబెట్టిన వారిని కాదని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వస్తున్న వారికి పెద్దపెట్ట వేస్తున్నారు. కొన్నిచోట్ల వారికి టిక్కెట్లు కేటాయిస్తున్నారు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు.. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికిప్పుడు వైసిపి నుంచి వస్తున్న వారికి టిక్కెట్లు కేటాయిస్తున్న పరిస్థితి. తాజాగా వైసీపీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మ‌నూరు జయరాం టిడిపి కండువా కప్పుకున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి జైరాం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా ఆయనకు చాలా చెడ్డ పేరు వచ్చింది. పైగా ఆయన చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయ‌న‌ ఎమ్మెల్యేగా గెలవలేర‌ని డిసైడ్ అయ్యాక జగన్ ఆయనను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయమని సూచించారు. పార్లమెంట్కు పోటీ చేయటం ఇష్టం లేని జయరాం వెంటనే టిడిపి కండువా కప్పుకుని అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గుంతకల్లులో ఐదేళ్లపాటు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఎంతో కష్టపడి పార్టీని బతికించారు. అలాంటి వ్యక్తులు కాదని ఇప్పుడు జయరాంకు సీటు ఇస్తే లోకల్ క్యాడర్ తాము జయరాంకు అసలు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు.

వాస్తవానికి జయరాంకు సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు కూడా ఇష్టం లేదట. కర్ణాటక కాంగ్రెస్ పెద్దల నుంచి చంద్రబాబుపై జయరాం గట్టిగా ఒత్తిడి తేవడంతో చంద్రబాబు తలొగ్గ‌క‌ తప్ప లేదని అంటున్నారు. బళ్ళారి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న నాగేంద్ర కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన జయరాంకు సోదరుడు అవుతారు. ఆ కోణంలో జయరాం బాబుపై ఒత్తిడి చేసి టిక్కెట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ వదిలించుకున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన కండువా కప్పుకుని అదే జనసేన నుంచి అదే బందరు పార్లమెంటుకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి – ఆనం రామనారాయణరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ వదిలించుకుంటున్న వారిలో కొందరు మంచి పేరు ఉన్న నేతలు ఉన్నా… కొందరు చెత్త నేతలను కూడా చంద్రబాబు దగ్గరికి చేర్చుకుని సీట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయడం మాత్రం వారి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N