NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

రెండు చేతులు లేనివారికి 10వేలు పింఛను

అమరావతి, జనవరి 12: రెండు చేతులులేని వారికి 10 వేల రూపాయల వంతున పింఛన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం రాజధానిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో గ్రామ, వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ర్ట, జిల్లా అభివృద్ధికి త్వరలో ప్రణాళిక తయారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ళపాటు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇళ్లు, పింఛన్లు, రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు.
జన్మభూమిలో 5.60 లక్షల ఫిర్యాదులు వచ్చాయనీ, వీటిలో 33 వేలు వెంటనే పరిష్కరించామనీ ఆయన చెప్పారు. మిగిలిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.
రేషన్, సంక్రాంతి కానుక, బీమా, విద్యారుణాలు, అన్న క్యాంటిన్ వంటి పథకాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
అభివృద్దిపై గ్రామాల్లో డిజిటల్ పెయింటింగ్స్ వేయించనున్నట్లు ఆయన తెలిపారు.
బిజెపితో విబేధించింది ప్రత్యేక హోదా, విభజన హామీల కోసమేనని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ హామీలను ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయడానికి ప్రధాని ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర భిజెపి నేతలు కూడా నిధుల విషయంలో కేంద్రాన్ని అడగటంలేదని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఫించన్లు, రైతుల రుణమాఫీ చేసిన తాలూకూ నిధులను రాష్ట్రానికి ఇంతవరకూ మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి మోదీకి అండగా నిలిచారనీ, సమస్యలపై చర్చించడానికి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని ఆయన అన్నారు. రోడ్డు మీదకు వస్తే ప్రజల్లో చులకన అవుతారని ప్రతిపక్షనేతలను ఉద్దేశించి ఆయన అన్నారు. పాదయాత్ర చివరి సభలో ప్రత్యేహ హోదా అంశం గురించి వైసిపి అధినేత జగన్ మాట్లాడలేదని ఆయన చెప్పారు. మోదీకి కోపం వస్తుందనీ, సిబిఐ కత్తి మెడ మీద ఉందని మాట్లాడటంలేదని ఆయన పేర్కొన్నారు.

author avatar
Siva Prasad

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Leave a Comment