NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు స్టోరీ : ఆ నేతపై పక్షపాతం చూపాడు… చివరికి ఏకాకి అయ్యాడు!

రాజకీయవేత్తలకు – వ్యాపారవేత్తలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అన్నది అనఫిషియల్ వాస్తవం. ఎంత కాదన్నా ఆపత్కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.

అదే పరిస్థితి తారుమారు అయి ఒకరికి కష్టం వచ్చిన పిమ్మట మరొకరు తమ స్వార్థం చూసుకునే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడే పదవుల కోసం పైరవీలు చేస్తారు. ఆ తర్వాత వారి సొంత వ్యాపారాలే వారికి ముఖ్యం. ఇలా తెలుగుదేశం పార్టీని వదిలి చాలామంది వెళ్లిపోయారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తరువాత ఆ పార్టీ వైపు తిరిగి చూసే వారే లేరు. అయితే అందరూ వెళ్లి పోవడం ఒక ఎత్తు కంభంపాటి రామ్మోహన్ రావు వెళ్లిపోవడం మరొక ఎత్తు. ఈ సమయంలో అధినేత చంద్రబాబుకు అండగా నిలవాల్సిన ముఖ్యనేత రామ్మోహన్ రావు ఇప్పుడు ఇలా ఇలా ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలు తెలుగుదేశం పార్టీలోనే కంభంపాటి రామ్మోహన్ రావు ఒక నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ హయాం లోనే అతనికి మంచి ప్రాముఖ్యత దక్కింది. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపికయ్యాడు. చంద్రబాబు కూడా తన హయాంలో అతనికి ఏమీ కాదు అనకుండా ఇచ్చేవారు. అలాగే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక ఢిల్లీలో బాబు అతనిని లాబీయింగ్ కు ఉపయోగించుకున్నాడు అన్న వార్తలు అప్పట్లో వచ్చేవి. ఇక ప్రభుత్వం మారడంతో రామ్మోహన్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

ఇటీవల రాజధాని భూముల కొనుగోలులో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినప్పుడు మాత్రం ఆయన వచ్చి స్పందించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీకి అందుబాటులో లేరు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా బయటకి రావడంతో పార్టీ నాయకత్వంపై అనుకున్న అసంతృప్తి బయటపడింది. ఇలా అయనకు పార్టీ పై లోపించిన నమ్మకం కారణంగానే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. అంతేకాకుండా సుజనా చౌదరికి రెండవసారి రాజ్యసభ పదవి ఇచ్చిన సమయంలో కంభంపాటి రాజ్యసభ పదవిని ఆశించారు.

అయితే అతనికి ఆ పదవి దక్కకపోవడంతో ఇలా రివర్స్ అయ్యాడు అని అంటుంటారు. అలాగే సుజనా చౌదరి కి కంభంపాటి కి విభేదాలు తలెత్తినపుడు బాబు సుజనా వైపు నిలబడ్డారట. మరి ఇప్పుడు నేను బాబు వైపు ఎందుకు నిలబడాలి…? అని తన స్వార్థం చూసుకుంటున్నట్లు రామ్మోహన్ రావు ప్రవర్తిస్తున్నాడని…. టిడిపి వర్గాల్లో మాట. మరి బాబు నిజంగా ఏకాకి అయిపోయే రోజులు దగ్గర పడుతున్నాయా?

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju