NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో యంగ్ లీడ‌ర్ సీటుకు ఎర్త్ పెట్టేసిన బాబు.. ల‌బోదిబో…!

బిజెపితో టిడిపి – జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేనతో పొత్తు నేపథ్యంలో టిడిపికి సీట్ల సర్దుబాటు సమస్య వచ్చింది. ఇప్పుడు బిజెపితో కూడా పొత్తు ఖ‌రారు కావడంతో టీడీపీకి మరో సరికొత్త సమస్య తప్పేలా లేదు. అటు జనసేనకు ఇటు బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి రావడంతో టిడిపిలో కొందరు కీలక నేతలను పక్కన పెట్టాల్సి వస్తోంది. బిజెపికి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్సభ స్థానాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. బిజెపికి ఇచ్చేది తక్కువ సీట్లే అయినా ఆ పార్టీకి ఏపీలో ఒక్కచోట కూడా బలం లేదు.

Babu who put earth for the seat of young leader in TDP.
Babu who put earth for the seat of young leader in TDP.

టిడిపికి బలం ఉన్న సీట్లు చంద్రబాబు వదులుకోక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే జనసేన. బిజెపికి సీట్లు ఇచ్చే క్రమంలో తమ టిక్కెట్‌కు ఎక్కడ ఎస‌రు పెడతారో అని టిడిపి నాయకులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ నేతకు కూడా చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టిడిపి యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి కి సీటు టెన్షన్ పట్టుకుంది. చంద్రబాబు ముందుగా ప్రకటించిన 94 మంది అభ్యర్థులలో శ్రీకాళహస్తి లేదు. బిజెపితో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదని అంటున్నారు.

ఇప్పుడు బిజెపితో అధికారికంగా పొత్తు కుదరడంతో శ్రీకాళహస్తి సీటు బిజెపికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. శ్రీకాళ‌హ‌స్తిలో బొజ్జ‌ల కుటుంబం 30 ఏళ్ల నుంచి టీడీపీ త‌ర‌పున రాజకీయం చేస్తోంది. బొజ్జ‌ల మృతి త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు సుధీర్‌రెడ్డి రాజ‌కీయం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సుధీర్‌రెడ్డి ఓడిపోయారు. ఈ సారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుధీర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి, భార్య కూడా జ‌నాల్లో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచే మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు కూడా సీటు రేసులో ఉన్నారు.

అయితే చంద్ర‌బాబు ఈ ఇద్ద‌రికి కాకుండా బీజేపీ నుంచి కోలా ఆనంద్‌కు సీటు ఇస్తే ఏ గొడ‌వా లేకుండా పోతుంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే ఈ సీటుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బొజ్జ‌ల సుధీర్‌కు పెద్ద షాక్ త‌గిలిన‌ట్టే అవుతుంది. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆనంద్‌కు సీటు ఇస్తే అటు జ‌న‌సేన స‌పోర్ట్ కూడా ఉంటుంది. పైగా శ్రీకాళ‌హ‌స్తిలో బ‌లిజ ఓట‌ర్లు ఎక్కువ‌.

కూట‌మి త‌ర‌పున ఒక్క చిత్తూరు జిల్లాలోనే తిరుప‌తి, చిత్తూరుతో పాటు శ్రీకాళ‌హ‌స్తి సీట్లు కూడా ఇచ్చిన‌ట్ల‌వుతుంది. అందుకే బాబు కూడా కోలా ఆనంద్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N