Bachhula: గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఘననివాళులు అర్పించారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అర్జునుడు మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. టీడీపీ అధినేత హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చారు.

అర్జునడు పార్ధివదేహానికి టీడీపీ జెండా కప్పారు. పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు చంద్రబాబు. ఆ తరువాత ధ్వంసం చేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. అర్జునుడు నియోజకవర్గ ఇన్ఛార్జి భాద్యతలు తీసుకున్న నాటి నుంచి చేసిన పనులను అధినేతకు పార్టీ నాయకులు వివరించారు. గన్నవరంలో కష్టాల్లో ఉన్న పార్టీని అర్జునుడు బతికించారని తెలిపారు. బచ్చుల పార్టీలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు.
బచ్చుల అర్జునుడి కొడుకులు బోస్, నాగబాబులను చంద్రబాబు ఓదార్చారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జలీల్ ఖాన్, మూల్పూరి బాలకృష్ణారావు, శ్రీరామ్ తాతయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, అనుమోలు ప్రభాకరరావు, గూడపాటి తులసీమోహన్, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, గుం డపనేని ఉమావర ప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ గోపాలకృష్ణ, పరిటాల వెంకటేశ్వరరావు, బొప్పిడి ప్రవీణ్, డాక్టర్ ఎన్ డి. శ్రీనివాసరావు, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, చిక్కవరపు నాగమణి, దండు సుబ్రమణ్యంరాజు, కాంగ్రెస్ నేత వింతా సంజీవరెడ్డి, కందిమళ్ళ ఆంజనేయులు, అంజనీకుమారి, మద్దుకూరి విజయ్ కుమార్, కెహెచ్ కోటేశ్వరరావు, జాస్తి శ్రీధర్, లావు సాయిలక్ష్మి తదితరులు నివాళులర్పించి సంతాపం తెలిపారు. టిడిపి శ్రేణుల్లో బచ్చుల అర్జునుడు మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.