Unstoppable program: నందమూరి నటసింహం బాలయ్య తొలి సారి హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షోను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు. మొదటి రెండు ఎపిసోడ్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో మూడో ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేశారు. కానీ మూడో ఎపిసోడ్ మాత్రం అనుకోకుండా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే..
Post office :ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో లక్షలు మీ సొంతం …!
అలరించిన మోహన్ బాబు, నాని..
అన్ స్టాపబుల్ షో మొదటి ఎపిసోడ్ కు డైలాగ్ కింగ్ మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తన సోదరి మంచు లక్ష్మీ హాజరయ్యారు. అలాగే రెండో ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని వచ్చారు. ఈ రెండు ఎపిసోడ్లలో బాలయ్య వారితో జరిపిన సంభాషణలు చూసి బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. దీంతో మూడో ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు.
img src=”https://newsorbit.com/wp-content/uploads/2021/11/Balakrishna-Image-Change-with-Aha-Unstoppable-Showlatest-tollywood.jpg” alt=”” width=”700″ height=”420″ class=”alignnone size-full wp-image-221228″ />
Municipal Election Results: నెల్లూరులో వైసీపీ స్వీప్.. ! కొండపల్లిలో బిగ్ ట్విస్ట్..! అది ఏమిటంటే..?
మూడో ఎపిసోడ్ కు అనుకోని ఆటంకం..
మూడో ఎపిసోడ్ ను టాలీవుడ్ రౌడీ స్టర్ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేశారట ఆహా టీం. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ మూవీ షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లారు. దీంతో అతడు రావడం ఆలస్యం కావచ్చునని టీం భావిస్తోంది. అంతే కాకుండా హోస్ట్ బాలయ్యకు కూడా చిన్న సర్జరీ అయింది. దీంతో అతడు షూటింగ్స్ కు కొద్ది రోజులు విరామం ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ రెండు కారణాల వలన అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయట. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ అనే సినిమాను కంప్లీట్ చేశారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ లో బాలయ్య చెప్పిన డైలాగులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా బాలయ్య మరో మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.