Sudigali sudheer: “ఈటీవీ ప్రస్తుతం మనుగడ సాగిస్తోంది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్, ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ వలనే!” అనే మాట గత కొన్నాళ్లుగా బుల్లితెర ప్రపంచంలో నడుస్తోంది. ఇక ఈ టీవీ లో వచ్చే ఏ ఇతర షోలు కూడా ఆ చానల్ కి అంత ప్లస్ కావనే విషయం అందరికీ విదితమే. అలాగే కేవలం జబర్దస్త్ కమెడియన్స్ వలనే ఈటీవీ బతుకుతోంది అనే ప్రచారం కూడా బయట జోరుగా సాగుతోంది. ఈ సమయంలో ఈటీవీ యాజమాన్యం ఆ ప్రచారం పై అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.
NGT: ఏపి సర్కార్ కు ఎన్జీటీ షాక్.. వాటికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే..
Sudigali sudheer: సుధీర్ ని అందుకే తప్పిస్తున్నారా?
ఈ నేపథ్యంలో కేవలం ‘జబర్దస్త్ కామెడియన్స్’ వల్లే ఈటీవీ బతుకుతుంది అంటే విషయం సదరు యాజమాన్యానికి నచ్చడం లేదు కనుక అందులో మేజర్ కీ రోల్ పోషిస్తున్న వారిని వారు ఏరివేసే పనిలో పడుతున్నారు. ఈ క్రమంలోనే డాన్స్ షో ‘ఢీ’ నుండి సుధీర్ ని తప్పించడానికి కారణం అని కొందరు వాదిస్తున్నారు. అలాగే మెల్ల మెల్లగా జబర్దస్త్ షో నుండి కూడా సుధీర్ ని ఏరేస్తారనే వార్తలు ముమ్మురంగా సాగుతున్నాయి. అదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్ పోస్టుని కూడా తీసేస్తారని తెలుస్తోంది.
Applications Banned: మరలా చైనా యాప్స్‌పై విరుచుకుపడిన కేంద్రం.. తాజాగా బ్యాన్ చేసిన 54 యాప్స్‌పై ఇవే!
సుధీర్ ని తీసే దమ్ము వుందా?
ఇకపోతే సుడిగాలి సుదీర్ ని పక్కకు పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ నడిపించే దమ్ము ఈటీవీ వారికి లేదంటూ సుధీర్ అభిమానులు ఛాలెంజులు విసురుతున్నారు. అయితే ఈటీవీ, మల్లెమాల వారు అంత తెలివి తక్కువ వారు మాత్రం కాదు. వారు తెగిస్తే ఏమైనా జరగొచ్చనేది నిపుణుల మాట. వెంటనే కాకుండా స్లోగా సుధీర్ ని పక్కకు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. వారు లేకుండా ప్రేక్షకుల్లో సదరు షోలపైన ఎలాంటి ఇంటరెస్ట్ కలిగించాలి అనే కోణంలో ప్రస్తుతం మల్లెమాల వారు హోమ్ వర్క్ చేస్తున్నారట!