బజాజ్ ఫైనాన్స్ సంస్థ పై ఈ విషయాల్లో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు రావడం జరిగింది.విషయం అటు తిరిగి ఇటు తిరిగి రిజర్వు బ్యాంకు దాకా వెళ్లడంతో ఆర్బీఐ స్పందించింది.దీంతో ఫైనాన్స్ సంస్థ బజాజ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది.ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జరిమానా విధించింది.కాగా కస్టమర్ల నుంచి రుణాలు రికవరీ చేయడంలో బజాబ్ ఫైనాన్స్ అనుసరిస్తున్న పద్దతులే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది . కస్టమర్ల నుంచి రుణ రికవరీలో బజాజ్ ఫైనాన్స్ పద్ధతి బాగోలేదని చాలా ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రూల్స్ అతిక్రమించినందుకు భారీ జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై రూ 2.5 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ తన ఔట్ సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మేనేజింగ్ రిస్క్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను అతిక్రమించడంతో ఆర్బీఐ సీరియస్ అయింది.
రిజర్వ్ బ్యాంకు నిబంధనలను బేఖాతరు!
ఆర్బీఐ నిర్దేశించిన రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం కస్టమర్ల నుంచి బజాజ్ ఫైనాన్స్ రుణాలు రికవరీ చేయడం లేదు.ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ నిబంధనలు కూడా అతిక్రమించిందని ఆర్‌బీఐ తెలిపింది.బజాజ్ ఫైనాన్స్ నిబంధనలను అతిక్రమించడంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 58 జీ, 58 బీలో ఉన్న పలు సబ్‌సెక్షన్ల కింద బజాజ్ ఫైనాన్స్‌పై జరిమానా విధించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణ రికవరీలో భాగంగా రికవరీ ఏజెంట్లు వినియోగదారులను వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయ్. వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో బజాజ్ ఫైనాన్స్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొని జరిమానా విధించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణ రికవరీపై కంపెనీపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని ఈ సందర్భంలో తెలిపింది. ఇలాంటి చర్యలు మరోసారి పునారవృతం అయితే…కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…