NewsOrbit
న్యూస్

బుడ్డోడి భవిష్యత్తుపై బాలయ్య… మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలు!

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితిని గమనిస్తున్న ప్రతీ టీడీపీ అభిమాని, మరి ముఖ్యంగా నందమూరి అభిమాని కోరుకుంటున్నది ఒక్కటే… పార్టీకి పూర్వవైభవం రావాలని, కావాలని! అవును… ఒకప్పుడు ఎలా ఉండే పార్టీ.. ఇప్పుడు ఎలా ఉంది? అన్నగారి టైంలో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ… బాబు హయాంలో ఇంతకాలం కూటములతో, పొత్తులతో నెట్టుకొచ్చిన పార్టీ… నేడు మరోసారి ఒంటరిగా పోటీచేసే సరికి ఇదా పరిస్థితి? ఇంతకాలం ఉన్నది, బాబు అన్నది నిజమైన బలుపు కాదా.. వాపు మాత్రమేనా? అని సగటు టీడీపీ అభిమాని తెగ ఫీలయిపోతున్న సమయమిది! ఈ సమయంలో వారికున్న ఒకే ఒక్క హోప్… జూనియర్ ఎన్టీఆర్!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోన్న ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్నారు టీడీపీ అభిమానులు. ఇదే క్రమంలో బాబు ముందు పైకి చెప్పకపోయినా చాలామంది టీడీపీ నేతలు కూడా… ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీ మనుగడ కష్టం అనే భావిస్తున్నారంట! ఈ క్రమంలో ఎన్టీఆర్ రాక కోసం వారు ఎంతగా ఎదురుచూస్తోందో చెప్పడానికి, బుడ్డోడి బర్త్ డే నాడు చంద్రబాబు చెప్పకపోయినా.. టీడీపీ నేతలంతా బాబు భయం పక్కనపెట్టి బుడ్డోడికి చెప్పిన శుభాకాంక్షలే సాక్ష్యం!

ఈ వ్యవహారంపై తాజాగా బాలయ్య స్పందించారు. తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడిన బాలయ్య… “రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం వాడి ఇష్టం” అంటూ స్పందించారు. ఈ విషయంపై మరింత క్లార్టీ ఇచ్చిన బాలయ్య… “తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. సినిమాల్ని వదిలేసి రమ్మని అడగలేం కదా. నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు కూడా ఒకపక్క ముఖ్యమంత్రిగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేశారు. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.” అంటూ ముగించారు!

రాజకీయాల్లోకి రావాలా వద్దా.. పూర్తిస్థాయిలో రావాలా, పార్ట్ టైం గా రావాలా అనేది జూనియర్ ఇష్టమే.. కాదనేది ఏముంది? కానీ… జూనియర్ రాకను చాలా మంది టీడీపీ నేతలు, నందమూరి అభిమానుల్లాగానే బాలయ్య కూడా కోరుకుంటున్నారా? లేక వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదని భావిస్తున్నారా? అదీ గాక.. వస్తే పెద్దల్లుడి పోస్టుకి కష్టం అని భావిస్తున్నారా? అనేది మాత్రం బాలయ్య మాటల్లో బయటపడలేదు!! ఈ ప్రశ్నలను మిగులుస్తూనే బాలయ్య తన అభిప్రాయాన్ని చెప్పారు!!

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju