Akhanda: నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో #No.1 గా నిలిచింది.. అత్యధిక మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డులను బద్దలు కొట్టింది.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అఖండ టీజర్ తో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. సోమవారం నుంచి ఈ సినిమా ఫైనల్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది..!! ఈ ఫైనల్ షూటింగ్ లో అఖండ కు సంబంధించిన హైలెట్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు..!!
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ స్టార్ మా సొంతం చేసుకుంది . ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ ధర పలుకుతుంది.. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లో బాలకృష్ణ ఈ సినిమాలో హైలెట్ సీన్స్ ని చిత్రీకరించనున్నారు బోయపాటి శీను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్..