Balakrishna: గతకొంత కాలంగా నట సింహం నందమూరి బాలృష్ణకు సరైన హిట్ దక్కక అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏ సినిమా చేసినా యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయింది. ఇక దర్శకుడు బోయపటి శ్రీను కూడా మాంచి మాస్ హిట్ తీయాలని కసిగా ఉన్నాడు. గత చిత్రం వినయ విధేయ రామ ఫలితం ఆయనను తీవ్రంగా కృంగదీసింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ హిట్ పడాల్సిందే అనే పట్టుదలతో బాలయ్యతో హ్యాట్రిక్ సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమా విషయంలో డివైడ్ టాక్ ముందు నుంచీ ఉండేది.
అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే ఊహించని విధంగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతగా రన్ అవుతోంది. బాలయ్య కొత్త రికార్డ్స్‌ను తిరగరాస్తున్నారు. ఇది బాలయ్య – బోయపాటిల అఖండ విజయం అంటున్నారంటే సినిమా ఏ రేంజ్లో హిట్ సాధించిందో అర్థమవుతోంది. ఇద్దరు కవలలు విడిపోయి ఒకరు అఘోరాగా మారతారనే పాయింట్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. గత చిత్రాల మాదిరిగానే బోయపాటి బాలయ్యను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించి సక్సెస్ సాధించాడు.
Balakrishna: అఖండ విజయంతో బాలయ్య బాలీవుడ్ హీరోలను మించిపోయారు.
ఇక అఖండ విజయంతో బాలయ్య బాలీవుడ్ హీరోలను మించిపోయారు. అఖండ రిలీజ్ రోజే సల్మాన్ అంతిం కూడా రిలీజైంది. ఈ రెండు సినిమాల వసూళ్ళు చూసుకుంటే అసలు పొంతన కుదరడం లేదు. సల్మాన్ కంటే బాలయ్య అఖండ వసూళ్ళు రెట్టింపు ఉన్నాయి. హిందీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ మార్కెట్ కూడా చాలా ఎక్కువ. అలాంటిది ఓ హిందీ సినిమాను బాలయ్య సినిమా ఎక్కడో తొక్కేసిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. అఖండ మూడు రోజుల వసూళ్ళు 35 కోట్లకు పైగా ఉంటే అంతిం సినిమా వసూళ్ళు కనీసం 18 కోట్లు కూడా దాటలేదు. అంటే బాలయ్య స్టామినా బాలీవుడ్ హీరోలను మించిపోయింది.