Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చిన హీరో నందమూరి బాలయ్య బాబు. సమరసింహా రెడ్డి సినిమా తో కొబ్బరికాయ కొట్టి నరసింహ నాయుడు తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన బాలయ్య బాబు అనేక ఫ్యాక్షన్ సినిమాలు చేస్తూ చెన్నకేశవరెడ్డి ఇంకా చాలా ఫ్యాక్షన్ సినిమాలతో.. రాయలసీమ ప్రాంత వాతావరణం పౌరుషం ఆ కత్తులు.. బాంబులు స్కార్పియో లు.. భారీ ఎత్తున తన సినిమాల్లో పెట్టి.. బాలయ్య బాబు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది.
బాలయ్య బాబు రాయలసీమ లైన్ ఎప్పుడూ కూడా.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను.. క్రియేట్ చేస్తూ మ్యాజిక్ చేయడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే మరో సారి ఎప్పుడు బోయపాటి తో చేస్తున్న అఖండ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కోసం రాయలసీమ ప్రాంతం లో బాలయ్య బాబు ప్రస్తుతం రచ్చరచ్చ చేస్తున్నారు. చిత్తూరు కడప కర్నూలు ఇంకా పలు చోట్ల సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలను… డైరెక్టర్ బోయపాటి తీస్తున్నారు.
Read more: Balakrishna: మరోసారి ఆ టాప్ డైరెక్టర్ తో పని చేయడానికి రెడీ అవుతున్న బాలయ్య బాబు..!!
కుదిరితే ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలని బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని.. సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు టాక్. ప్రస్తుతం బాలయ్య బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో విజయం సాధించి.. హిట్ ట్రాక్ లో పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో బోయపాటి సింహా లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించడంతో అఖండ సినిమాతో.. హ్యాట్రిక్ విజయం సాధించాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య బాబు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?