Balakrishna: నందమూరి బాలయ్య బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా పట్టాలెక్కిం చేస్తారు. తన పని తాను చేసుకొని పోతారు ఫలితం గురించి పెద్దగా పట్టించుకోరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్యబాబు డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో “అఖండ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర కి పైగా జరుగుతోంది. ప్రస్తుతం చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది.
ఇటువంటి తరుణంలో… అఖండ సినిమా రాబోయే దసరా పండుగకు రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలాఉంటే ఇటీవల బాలయ్య బాబు తన పుట్టినరోజు నాడు అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండా అనే మరో సినిమాకి బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Read more: Balakrishna: గోపీచంద్ మలినేని బాలయ్య బాబు కొత్త సినిమా లేటెస్ట్ అప్ డేట్..??
విషయంలోకి వెళితే లౌక్యం లక్ష్యం వంటి సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీనివాస్ గతంలో బాలయ్య బాబు తో సినిమా చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోసారి బాలయ్య బాబు తో సినిమా చేయడానికి శ్రీనివాస్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు.. ఇటీవల ఈ స్క్రిప్ట్ సి.కళ్యాణ్ నిర్మాతకి వినిపించినట్లు.. ఆయన లాక్ చేసినట్లు త్వరలోనే బాలయ్య బాబుతో ఈ స్క్రిప్ట్ గురించి చర్చించి అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాలయ్య బాబు కి కూడా ఒకసారి శ్రీనివాస్ వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. ఇదిలా ఉంటే ఒక శ్రీనివాస్ తో మాత్రమే కాక.. డైరెక్టర్ వివి వినాయక్ తో.. అదే రీతిలో అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీనివాస్ తో మరోసారి బాలయ్య బాబు సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది.