బాలకృష్ణ బిబి3 నుంచి వచ్చిన అప్‌డేట్ తెలిస్తే పూనకాలతో డాన్సులే ..!

Share

బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా BB3 అన్న వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. balakrishna – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. BB3 ఫస్ట్ రోర్ కూడా ఈ కాంబినేషన్ మీద విపరీతంగా అంచనాలు పెంచేసింది. గతంలో బోయపాటి శ్రీను సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇద్దరిది హిట్ కాంబినేషన్ అని ఇండస్ట్రీ వర్గాల తో పాటు అభిమానుల్లో గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరోసారి ప్రువ్ చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా balakrishna సినిమాలో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలాగే మేయిన్ విలన్ గా మరొక సీనియర్ నటుడు కనిపించబోతున్నాడు. అయితే ఆ నటుడెవరన్నది మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. అంతేకాదు balakrishna బిBB 3 లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన హీరోయిన్స్ గా నటుస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు BB3 నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. దాంతో బాలయ్య అభిమానులు కొంత నిరాశతో ఉన్నారు. ఆ నిరాశని పోగొట్టేందుకు బాలయ్య – బోయపాటి శ్రీనుల BB 3 నుంచి మంచి అప్‌డేట్ వచ్చింది. ఈ న్యూస్ తో balakrishna ఫ్యాన్స్ స్టెప్పులేస్తారని చెప్పుకుంటున్నారు. బాలయ్య సినిమాలో ఖచ్చితంగా ఒక మాస్ సాంగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మాస్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ ని నిర్మించారట. ఈ సెట్ లో ఇప్పుడు మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సాంగ్ లో బాలయ్య తో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ స్టెప్పులేస్తోంది.


Share

Related posts

Shanmukh Jaswanth: డ్యాన్స్ ప్లస్ షోలో సోషల్ మీడియా స్టార్ షన్ముఖ్ జస్వంత్ హంగామా?

Varun G

దేశంలో కరోనా కల్లోలం.. 14లక్షలకు చేరువలో కేసులు

Muraliak

Vaishnavi Chaitanya : మిస్సమ్మగా అదరగొట్టేస్తున్న సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య

Varun G