Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో వయసుతో నిమిత్తం లేకుండా మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నది నందమూరి బాలయ్య బాబు. ఒకపక్క రాజకీయరంగంలో ఎమ్మెల్యేగా రాణిస్తూనే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉంటూనే.. మరోపక్క సినిమారంగంలో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్యబాబు వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తన కెరియర్ లో తిరుగులేని 2 బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం “అఖండ” అనే సినిమా చేస్తున్నారు.
గతంలో లెజెండ్, సింహ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా తో హాట్రిక్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే రీతిలో బాలయ్య బాబు మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ చాలా సరదాగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది. దీంతో దసరా సందర్భంగా అక్టోబర్ మాసం నాడు సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొదటిలో సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని.. బాలకృష్ణ లక్కీ పండుగ సందర్భంగా ప్రతి సెంటిమెంట్ అని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. హెచ్ ఎస్ సినిమా మా షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ముందుగానే సినిమా రిలీజ్ చేయాలని అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో అని.. ఇండియన్ బిగ్గెస్ట్ మోస్ట్ వెయిటింగ్ పాన్ ఇండియా మూవీ..RRR రిలీజ్ అవుతున్న సమయంలో బాలయ్య కొండ సినిమా కూడా రిలీజ్ అవుతున్న టు లేటెస్ట్ టాక్. ఏది ఏమైనా పోటీకి బాలయ్య బాబు.. మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లు దసరా పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలకు చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ టాక్.