Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోల సినిమాల కొడుకులు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున మరి కొంతమంది హీరోల కొడుకులు.. వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చలామణీ అయిపోతున్నారు. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది ఎప్పటి నుండో ఇండస్ట్రీలో.. అభిమానులలో ఆసక్తికరంగా ఉందన్న సంగతి తెలుసు. గతంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు బాలయ్య స్క్రిప్టు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో అప్పట్లో సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వార్త ఫేక్ అని తేలింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వటానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందని 2023 లో సినిమా ఎంట్రీ ఉంటుందని.. ఆదిత్య369 కి సీక్వెల్ లో నటించే టట్టు ప్లాన్ చేస్తున్నట్లు దానికి.. తానే దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు ఇటీవల బాలయ్య తెలపడం జరిగింది. ఇలా ఉంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇంకా రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ అవటంతో నందమూరి అభిమానులు డిసప్పాయింట్ అయిపోయారు.
Read More: Nandamuri kalyan ram: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్..!!
త్వరగా ఎంట్రీ ఇస్తే భవిష్యత్ బాగుంటుంది కదా అంటూ.. తాజా వార్త పై సోషల్ మీడియాలో అభిమానుల డిస్కషన్ లు చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో కరోనా కారణంగా సినీ కార్మికులకు చేతినిండా పని పని ఉండేలా అమలు చేయాలని తనకి నాలుగు నెలల్లో 3 సినిమాలు కంప్లీట్ చేసే సత్తా ఉందని మంచి కథ ఉంటే చేస్తానని బాలకృష్ణ ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.