Balakrishna: ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలపాటు జరుగుతూనే ఉంది. కరుణ వైరస్ రావటంతో.. సినిమా షూటింగ్ కి అనేకసార్లు అవంతరాలు అన్ని సినిమాల మాదిరిగా దీనికి కూడా ఎదురయ్యాయి. దీంతో ఉన్న టైంలోనే బాలయ్య బాబు బోయపాటి.. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది.
దీంతో ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు అని ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు తన తర్వాతి సినిమా గోపీచంద్ తో చేస్తున్నట్లు తన పుట్టినరోజు నాడు క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ విషయంలో ఇటీవల బాలయ్య బాబు తో గోపీచంద్ మలినేని.. మరోసారి డిస్కషన్ చేయడం జరిగింది అంట. ఈ క్రమంలో బాలయ్య బాబు యాక్షన్ సన్నివేశాల విషయంలో మరీ అంత హై వోల్టేజ్ ఫైట్ లు అవసరం లేదని… స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు కొద్దిగా బాలయ్య సూచించడం జరిగిందట.
Read more: Balakrishna : బాలకృష్ణకు పోటీ రవితేజ కాదు రాకింగ్ స్టార్..!
ఫైనల్ స్క్రిప్టు మొత్తం రెడీ చేసి ఇటీవల రెండు రోజుల క్రితం బాలయ్యతో గోపీచంద్ మలినేని కూర్చున్నట్లు ఈ క్రమంలో.. బాలయ్య కొన్ని సూచనలు ఇవ్వటంతో ప్రస్తుతం.. ఆ దిశగా స్క్రిప్ట్ చేంజ్ చేయటానికి డైరెక్టర్ రెడీ అయినట్లు టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం చేస్తున్న “అఖండ” సినిమా షూటింగ్ బ్యాలెన్సింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి.. బాలయ్య బాబు బోయపాటి సరికొత్త షెడ్యూల్స్ రెడీ చేసినట్లు ఏదిఏమైనా వచ్చే సంక్రాంతికి ఈ సినిమా బరిలో దించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.