అనిల్ రావిపూడి వరుస హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఎఫ్3 సినిమా మాత్రం అతనికి ఒక డిజాస్టర్ మిగిల్చింది. ఎఫ్3 నిర్మాతకు లాభాలను అందించింది కానీ డిస్ట్రిబ్యూటర్స్‌కి మాత్రం నష్టం మిగిల్చిందనే చెప్పాలి. అనిల్ రావిపూడి రెగ్యులర్ కామిడీతో రావడంతో ప్రేక్షకులకు దారుణంగా అతని అతని సినిమాని రిజెక్ట్ చేశారు. దిల్ రాజు అనిల్‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని తెరకెక్కించాడు. కానీ ఆ నమ్మకాన్ని అనిల్ వమ్ము చేశాడు.
బాలయ్య లుక్ అదరహో
అయితే నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణతో మూవీ చేసేందుకు అనిల్ రావిపూడి కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను 45 ఏళ్లు పైబడిన ఒక పవర్ఫుల్ హీరోగా అనిల్ చూపించనున్నాడు. ఈ మూవీలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. అంటే లైట్ గా వైట్ కలర్ హెయిర్/బీయర్డ్, మంచి హెయిర్ స్టైల్, నేచరల్ లుక్. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మాలినేని మూవీలో కూడా అలాంటి లుక్‌లోనే కనపడుతున్నాడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం కొంచెం డిఫరెంట్ గా బాలయ్యని హైలెట్ చేస్తాడని అంటున్నారు.
మరిన్ని విశేషాలు
బాలయ్యకు అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకి ఓకే చూపినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ని మరింత స్టైలిష్ గా చూపించడానికి బాలయ్య తన స్టైలిష్ తో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలిలా బాలయ్యకు కూతురిగా నట్టించబోతుందని టాక్. హీరో రాజశేఖర్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో అలరించునున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు వినికిడి.