Balakrishna : బాలకృష్ణ అందుకే సంథింగ్ స్పెషల్..!

Share

Balakrishna : బాలకృష్ణ కొన్ని విషయాలలో చాలా కఠినంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయనకి ఏదైనా నచ్చకపోతే ..పో చంపేస్తా..అంటూ పక్కకి వెళ్ళిపోతారు. అభిమానుల మీద చేయి చేసుకున్నా అది వేరే అర్థం కాదు అంటుంటారు. బాలయ్య బయట ఉండే విధానమే అది. సినిమాలో మాదిరిగా నటించడని చెప్పుకుంటుంటారు. ఇక సినిమాల విషయంలో కూడా చాలా కరెక్ట్ గా ఉంటారని పలు సందర్భాలలో నిరూపణ అయింది. ముఖ్యంగా సినిమా బడ్జెట్ ఎప్పుడు కంట్రోల్ లోనే ఉండాలని అంటుంటారు. ఇప్పుడు అందరూ పాన్ ఇండియన్ సినిమా అంటుంటే ఆయన మాత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమానే పాన్ ఇండియన్ సినిమా అంటున్నారు.

balakrishna is always something special
balakrishna is always something special

ఆయన నటిస్తున్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ అని తెలిసిందే. అందుకే భారీ హిట్ అందుకోవాలని ఎంతో కసిగా ఉన్నారట. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి బడ్జెట్ 65 – 70 కోట్ల వరకు కేటాయించారని చెప్పుకుంటున్నారు. భారీ బడ్జెట్ కావడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి బాలయ్య తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారట.

Balakrishna : బాలకృష్ణ నిర్ణయాలు నిర్మాతలకి చాలా హెల్ప్..!

ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక పెద్ద హీరో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు చాలా వరకు సేఫ్ గా ఉంటారు. మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇప్పుడు బాలయ్య అదే చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య 7 నుంచి 7.5 కోట్లు మాత్రమే రేమ్యూనరేషన్ తీసుకుని.. సినిమాకి మంచి లాభాలు వస్తే అందులో వాటా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రస్తుతం రెమ్యూనరేషన్ తీసుకునే ఆలోచనలో లేనట్టు సమాచారం. నిజంగా ఇలాంటి నిర్ణయాలు నిర్మాతలకి చాలా హెల్ప్ అవుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు.


Share

Related posts

శ్రీముఖి గుండెల్లో ఏముందో కళ్లల్లో తెస్తుందంటున్న జానీ మాస్టర్?

Teja

ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఓటు

Siva Prasad

 Bihar : బీహార్ లో గందరగోళం..! ఎమ్మెల్యేలను రక్తం వచ్చేలా కొట్టిన పోలీసులు

siddhu