Balakrishna: పాత్ర ఏదైనా, కథ ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి.. వందకి వంద శాతం తన నిబద్ధతను చాటే అతి కొద్దిమంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడి గా ఎదిగారు.. ఆయన తొడగొడితే రికార్డులు.. మీసం తిప్పితే రివార్డులు.. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు.. అయినప్పటికీ బాలకృష్ణ లిస్టు నుంచి ఏడు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. బిజీ షెడ్యూల్స్, కథ నచ్చక పోవడం లాంటి కారణాలతో ఈ 7 సినిమాలు మిస్ అయ్యాయి.. అలా మిస్ అయినా సినిమాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
1. బజారు రౌడీ :
బాలకృష్ణ కోసం రెడీ నీ చేసిన ఈ సినిమాను బాలయ్య బాబు రిజక్ట్ చేయడంతో కృష్ణ కొడుకు రమేష్ బాబు చేసి హిట్ కొట్టారు..
2. జానకి రాముడు :
విజయేంద్రప్రసాద్ రైటర్ గా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ చిత్రం నుండి కోడి రామకృష్ణ తప్పుకోవడంతో.. ఈ చిత్రం నుండి దీంతో ఈ సినిమా బాలకృష్ణ కూడా తప్పుకున్నారు. దీంతో ఈ చిత్రం నాగార్జున లిస్టులో చేరింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.
3. చంటి :
తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను పరుచూరి బ్రదర్స్ బాలయ్య ను దృష్టిలో ఉంచుకొని.. ఈ కథలో కొన్ని మార్పులు చేసి బాలకృష్ణ కు వినిపించారు. అయినప్పటికీ కథ నచ్చలేదని బాలకృష్ణ తిరస్కరించడంతో.. ఈ సినిమా వెంకీ చేతిలో పడి సూపర్ హిట్ గా నిలిచింది..
4. సూర్యవంశం :
పెద్దన్నయ్య కథను పోలి ఉందని కారణంతో ఈ సినిమాను కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేశారు.. ఈ సినిమాను తీసిన వెంకటేష్ కెరియర్ లో బంపర్ హిట్ గా నిలిచింది.
5.సీతయ్య :
చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమాను వదిలేశారు.
6. సింహాద్రి :
విజయేంద్రప్రసాద్, రాజమౌళి బాలకృష్ణ కోసం సిద్ధం చేసిన నా కథ ఇది. అయితే బాలయ్య ఈ కథ తనకు సూట్ అవ్వదని వదిలేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.
7. శివరామరాజు :
ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం మొదట బాలకృష్ణను సంప్రదించగా.. ఫుల్ లెన్త్ పాత్ర కాకపోవడంతో ఈ సినిమాను కూడా బాలయ్యబాబు రిజెక్ట్ చేశారు.
ఈ ఏడు సినిమాలు బాలయ్య తీసి ఉంటే.. మరోలా ఉండేది. సరికొత్త రికార్డు లు సృష్టించేవారు.. హిస్టరీ నిలిచిపోయేవి..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!