Balakrishna- Puri jagannadh: నట సింహం నందమూరి బాలకృష్ణ త్వరలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని ఇప్పటి వరకు అఖండ సినిమా నుంచి వచ్చిన ప్రతీది చూస్తే అనిపిస్తున్నాయి. రెండు విభిన్నమైన పవర్ఫుల్ పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నారు. డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న అఖండ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
నవంబర్ 13న ఘనంగా ప్రారంభం అయిన బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా డిసెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమాను చేయనున్నారని సమాచారం. ఇంతకముందు బాలయ్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్లో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీటవుతుండటంతో అంచనాలు బాగానే
ఉన్నాయి.
Balakrishna- Puri jagannadh: 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంలో బాలకృష్ణ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!
ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమా తర్వాత సొంత బ్యానర్లోనే బాలయ్యతో సినిమా చేయబోతున్నారు పూరి. ఇది పాన్ ఇండియన్ రేంజ్లో రూపొందనుందని సమాచారం. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక యాత్ర సినిమాను నిర్మించిన 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కూడా బాలకృష్ణ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందట.