Kota Srinivasrao: ” ఉమ్మేశాడు ” అన్న కోట శ్రీనివాసరావు మాటలకి రెస్పాండ్ అయిన బాలకృష్ణ ??

Share

Kota Srinivasrao: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు కోట శ్రీనివాస రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నాటినుండి నటిస్తున్న కోటశ్రీనివాసరావు ఇప్పటి కుర్ర హీరోల సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. విలన్.. కామెడీ.. సెంటిమెంట్ నవరసాలు పండించడంలో కోట శ్రీనివాసరావు స్టైలే వేరు. ముఖ్యంగా బాబు మోహన్ తో కోట శ్రీనివాస రావు చేసే కామెడీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఆ సన్నివేశాలు చూసి.. బాగా ఎంజాయ్ చేస్తారు. విలక్షణ నటుడిగా కెరీర్ లో అనేక పాత్రలు చేసిన కోట శ్రీనివాసరావు.. ప్రస్తుతం చాలా వరకు సినిమాలు చేయడం లో గతంలో కంటే స్పీడ్ తగ్గించారు. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. తనకు ముగ్గురు సహోదరులు అని చెప్పుకొచ్చారు.

Kota Srinivas Rao: న‌మ‌స్కారం చెప్పినందుకు బాల‌య్య నా మొహంపై ఉమ్మాడు : కోట‌ | The News Qube

1975లో “ప్రాణం ఖరీదు” సినిమా తో.. సినిమా రంగం ఎంట్రీ ఇచ్చినట్లు.. తన లైఫ్లో 8 నంది అవార్డులతో వచ్చినట్లు కోట శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీరామారావు తో తనకు ఎటువంటి విభేదాలు లేవని… ఆయన ముఖ్యమంత్రి అయిన సమయంలో మండలాధ్యక్షుడు అనే సినిమా చేయడం జరిగింది. ఆ సమయం లో ఎన్టీఆర్ పాత్ర అన్న తరహాలో తన క్యారెక్టర్ ఉందని మీడియా మొత్తం ఆ రీతిలో వార్తలు ప్రచారం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ క్యారెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల మరికొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు తన చేత బలవంతంగా వేయించడం జరిగింది అని ఇండస్ట్రీకి అప్పటికే కొత్త అని.. కోట చెప్పుకొచ్చారు. రామారావు గారి పై కోపంతో ఆ క్యారెక్టర్ చేయలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత రామారావు గారిని కలవడం కూడా జరిగిందని.. పేర్కొన్నారు.

Balakrishna Spat On Kota Srinivas Rao's Face

ఎయిర్ పోర్ట్ లో ఒకనోక టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామారావు గారిని కలవడం జరిగింది అని.. డబ్బింగ్ చెప్పి వస్తున్న సమయంలో ఆయన ఏర్పాటులో ఉన్న టైంలో ఆయన దగ్గరికి వెళ్లి కలిసి అని ఆ సమయంలో రామారావు గారు తన నటనని మెచ్చుకోవటం మాత్రమే కాక ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారని.. ఆరోగ్యమే మహాభాగ్యం అని తనని భుజం తట్టారు అని, ఆ సమయంలో ఆయన కాళ్ళకి దండం పెట్టడం జరిగిందని చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అని అన్నారు. “మండలాధ్యక్షుడు” లో ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసినందుకు తనపై అనేక దాడులు జరిగాయని బెజవాడలో కూడా ఒక ఎటాక్ జరిగిందని తెలిపారు. ఇంత జరిగినా కానీ ఇండస్ట్రీలో తనకి.. వేషాలు మాత్రం తక్కువ కాలేదని పేర్కొన్నారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి పది, పన్నెండు సినిమాలు ఒకన్నోక టైంలో ఒక సంవత్సరంలో 18 సినిమాలు.. చేయడం జరిగిందని.. ఆయన ప్రతి సినిమాలో తనకి ఓ క్యారెక్టర్ ఉండేదని పేర్కొన్నారు.

రాజమండ్రి లో బాలకృష్ణ…

ఇదిలా ఉంటే రాజమండ్రిలో జంధ్యాల గారి సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తు ఉన్న టైంలో అదే సమయంలో.. బాలకృష్ణ రావడం జరిగిందని తెలిపారు. అప్పటికే లిఫ్ట్ దగ్గర ఉన్న టైంలో కొంతమంది పక్కకి వెళ్ళి పక్కకి వెళ్ళి గట్టిగా సైగిల్ చేశారని.. కానీ నాకు అర్థం కాలేదు.. అప్పుడు బాలకృష్ణ ఒక్కసారిగా కనబడేసరికి మర్యాదగా… నమస్కారం బాబు అని చాలా సంస్కారంగా దండం పెడితే ఆయన కాండ్రించి మొహం మీద ఉమ్మేశరు అని స్పష్టం చేశారు. పైగా టైంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్… ముఖ్యమంత్రి అబ్బాయి… వాళ్ళ నాన్న ని కించపరిస్తే కోపం రాజు అంటూ.. కోట శ్రీనివాసరావు తెలిపారు. అప్పటికే సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆ సమయంలో భానుమతి గారు తనని చూసి సేమ్ ఎన్టీఆర్ గారిని చూసినట్లే ఉంది. ఏ ఊరు అని తనని ప్రశ్నించడం జరిగిందని బెజవాడ దగ్గరలో ప్రాంతమని.. స్పష్టం చేసినట్లు .. కోట శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ నిన్న ఆదివారం సోషల్ మీడియా లో రిలీజ్ కావటంతో కోటపై బాలకృష్ణ కాండ్రించి ఉమ్మివేయడం అనే వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో బాలకృష్ణ నీ ..ఈ వార్తపై కొంతమంది జర్నలిస్టులు… ప్రశ్నించినట్లు ఆయన.. ఈ వార్తపై నో కామెంట్స్ అంటూ ప్రశ్నని దాట వేసినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. ఏది ఏమైనా నటుడిగా జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు కామన్ అంటూ.. ఈ సంఘటన చెప్పుకొని కోట శ్రీనివాస రావు కొద్దిగా బాధపడ్డారు.


Share

Related posts

Neeraj Chopra: ఒలింపిక్స్ లో భారత్ కి తొలి స్వర్ణం..! అథ్లెటిక్స్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా

arun kanna

Congress Leader : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..! 10 వేల కోట్లు అంటూ ఒక్కొక్కరికీ చురకలు..!!

Yandamuri

బిగ్ బాస్ 4 : “నన్ను కౌగిలించుకొని ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు…?” – హవ్వా హద్దులు దాటిన మాటలు

arun kanna