ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని పునర్జీవం చేయాలంటే అది జూనియర్ ఎన్టీఆర్కే సాధ్యం అన్నది నిర్వివాదాంశం. సాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయం. టిడిపి సీనియర్లు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయమై మాట్లాడటానికి సాహసించలేక కున్నారు.నిజానికి నందమూరి బాలకృష్ణ కుండబద్దలు కొట్టినట్టు ఏ విషయమైనా మాట్లాడతారు. ఎవర్నీ లెక్క చేయని రీతిలో మాట్లాడటం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకత.అలాంటి బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై నీళ్లు నములుతున్నారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో తారక్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించిన బాలయ్య… “తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. నాన్నగారు కూడా ఒకపక్క ముఖ్యమంత్రిగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేశారు. నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.” అని అన్నారు! బాలయ్య వ్యాఖ్యలను విశ్లేషిస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం మంచిదేనని టిడిపికి మేలు చేస్తుందని ఆయన మనసులో ఉన్నా పైకి చెప్పటానికి వెనుకంజ వేస్తున్నట్లు అర్థమవుతోంది .
ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేదని.. ఇలానే బాబు – చినబాబు ద్వయంతో ముందుకు వెళ్తే కాలగర్భంలో కలిసిపోతామని అంటున్నారు. ఈ సమయంలో బాలయ్య నోరు తెరిచి రాజకీయాల్లో కి రమ్మని జూనియర ఎన్టీఆర్లు ఆహ్వానించే అవకాశం ఉన్నా ఆయన అందుకు సిద్ధంగా లేకపోవటం వెనుక అనేక కారణాలేమీ లేవు.కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్న వియ్యంకం ఆయన నోటికి తాళం వేస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ గనుక రాజకీయాల్లో కివస్తే తన సొంత అల్లుడు లోకేష్ పూర్తిగా వెనుకబడి పోతాడన్న విషయం బాలయ్యకు తెలియంది కాదు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను బహిరంగంగా రాజకీయాల్లోకి తాను గనుక ఆహ్వానిస్తే వియ్యం కుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి కూడా గురవుతానన్న భయం బాలయ్యకు లేకపోలేదు. అందువల్లే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ముందడుగు వేయకుండా తన నోటికి తానే తాళం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది