న్యూస్ సినిమా

Balakrishna: సినిమాలు చేయడంలో మరింత స్పీడ్ పెంచిన బాలకృష్ణ..??

Share

Balakrishna: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండున్నర సంవత్సరాలు సినిమా షూటింగ్ లకి బ్రేక్ లు మీద బ్రేక్ లు పడ్డాయి. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు… సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో వైరస్ ప్రభావం తగ్గటంతో రెండున్నర సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న సినిమాలు… వరుసగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సినిమా షూటింగులు విషయంలో కూడా హీరోలు స్పీడ్ పెంచుతూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే సీనియర్ హీరోలలో బాలయ్య బాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కరోనా ప్రభావం ఉన్నా గాని “అఖండ” థియేటర్ లో రిలీజ్ చేసి విజయం సాధించారు.Nandamuri Balakrishna: Natasimham speeds up .. Balayya movie with Mahesh Babu director? | Nandamuri Balakrishna movie with director parashuram - filmyzoo - Hindisip

ఆ తర్వాత వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ నేపథ్యం కలిగిన సినిమా బాలకృష్ణ స్టార్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ తెలంగాణలో జరుగుతోంది. గోపీచంద్ మలినేని కి డైరెక్టర్ గా…ఒక్క పరాజయం లేకపోవడంతో.. బాలయ్య అభిమానులు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే అనిల్ రావిపూడి షూటింగ్ కూడా జూన్ నెల నుండి స్టార్ట్ చేసేయాలని.. ఆ సినిమా నిర్మాతలకు తాజాగా బాలయ్య బాబు కొత్త ఆదేశాలు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వెలువడుతున్నాయి. Nandamuri Balakrishna, director Venky Atluri to collaborate for a move: Report | Deccan Herald

రెండు సినిమాల షూటింగులు ఏకకాలంలో చేసి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని బాలయ్య బాబు అక్క ఆలోచన అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాదు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాల తర్వాత… మరో కుర్ర డైరెక్టర్ సినిమా చేయటానికి బాలయ్య బాబు రెడీ అయినట్లు ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా టీజర్ జూన్ పదవ తారీకు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కరోనా తర్వాత.. షూటింగ్ స్టార్ట్ చేయటంలో మంచి స్పీడ్ మీద ఉన్న హీరో బాలయ్య బాబు అని చెప్పవచ్చు.


Share

Related posts

బిసిల అభ్యున్నతికి 15వేల కోట్లు : జగన్

somaraju sharma

Pawan Kalyan: రామ్ చరణ్ తో అయితే ఆ తరహా సినిమా చేస్తానంటున్న పవన్..??

sekhar

ఏపి ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar