Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు యంగ్ హీరోల సినిమాలలో కలిసి నటిస్తుంటారు. గతంలో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉళిక్కి పడతారా సినిమాలో కీలక పాత్ర పోషించారు. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కనిపించబోతున్నారట. అసలు ఇలాంటి కాంబినేషన్‌ను చూపించాలనే థాట్ ఎలా వస్తుందో…ఎవరికి వస్తుందో అని అంతా ఆరా తీస్తున్నారు. ఇలాంటి షాకింగ్ కాంబినేషన్ సెట్ చేయాలంటే మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కే సాధ్యం.
పూరి జగన్నాథ్ ఇంతకముందు బాలయ్యతో పైసా వసూల్ అనే సినిమా తీశారు. ఈ సినిమా మరీ పోకిరి రేంజ్లో బ్లాక్ బస్టర్ కాకపోయినా ఓ మాదిరి హిట్‌గా మాత్రం నిలిచింది. ఈ ఏజ్‌లో బాలయ్యతో ఇలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలంటే అది పూరి వల్లే అవుతుంది. ఇక ఈ కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా అందరిని బాగానే ఎంటర్టై చేసింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ కూడా కానుంది. బాలయ్య అఖండ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
Balakrishna: బాలయ్య – విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో.
దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమా చేయనున్నారు. ఇక ప్రస్తుతం పూరి ..విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరి – ఛార్మి – బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాతలు. ఇందులో బాలయ్య విజయ్ దేవరకొండతో కలిసి కాసేపు సందడి చేయబోతున్నారట. బాలయ్య కనిపించే ఆ కొద్దిసేపు జై బాలయ్య అని అభిమానుల కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోతాయని పూరి టీమ్ అంటున్నారట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో..ఒకవేళ నిజమైతే బాలయ్య – విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ ఎలా
ఉండబోతున్నాయో.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!