న్యూస్ సినిమా

బాలకృష్ణ ఫేవరెట్ మూవీ అదా..? అవాక్కవుతున్న అభిమానులు!

Share

ఒకప్పుడు సినిమాలంటే ప్రేమ, ఫైట్లు, రొమాన్స్, పాటలు మాత్రమే ఉండేవి. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువగా సూపర్ హిట్స్ చేసేవారు. అలాంటి టైమ్‌లో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేశాడు. అదే సమరసింహారెడ్డి మూవీ. అప్పటికే బాలకృష్ణతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన బి.గోపాల్ ఈ సినిమాకీ దర్శకత్వం వహించాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సింధూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి ఈ సినిమాకి మెయిన్ లీడ్ తీసుకుని దానికి బాలీవుడ్‌ హిట్ సినిమా ‘దుష్మాన్ ‘ లాంటి యాక్షన్ కథని జోడించారు.

బాలయ్య ఫేవరెట్ అదే

1999లో సంక్రాంతికి సందర్భంగా చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాకి పోటీగా సమరసింహారెడ్డి సినిమాను విడుదల చేశారు. అయితే బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. తెలుగు సినిమా చరిత్రలో రికార్డులను తిరగరాస్తూ 77 కేంద్రంలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో తన రికార్డులను తానే బ్రేక్ చేశాడు. కానీ బాలకృష్ణకు నరసింహనాయుడు సినిమా కంటే సమరసింహారెడ్డి సినిమా అంటేనే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

ఇది ఊహించని ఫ్యాన్స్‌

బాలకృష్ణ తన కెరీర్‌లో పౌరాణికం, జానపదం, సాంఘికం, యాక్షన్, ప్రేమ కథ సినిమాలో నటించాడు. వాటన్నిటిలో సమరసింహారెడ్డి అంటేనే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ సినిమాతోనే బాలకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే బాలయ్య బాబు నటించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం, ముద్దుల మావయ్య చాలా మందికి ఫేవరేట్స్‌గా నిలిచాయి. వీటిలో బాలకృష్ణ ఫేవరెట్ లేకపోవడంతో చాలా మంది అభిమానులు అవాక్కవుతున్నారు.


Share

Related posts

సింగర్ సునీత రెండో పెళ్లి విషయంలో అప్డేట్

sekhar

ఎస్పీ గిస్పీ జంతా నై!! ఈ అతి అనర్ధం జగన్!!

Comrade CHE

Nani – Nirupam: నాని హీరో అవడానికి కారణం డాక్టర్ బాబేనా..!?

bharani jella