NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?

ప్రతి ఏటా రికార్డు సృష్టిస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. బాలాపూర్ గ్రామ సెంటర్ లోని బొడ్రాయి వద్ద ఈ వేలం పాటన నిర్వహించగా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఒకరైన లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ.5లక్షల70వేలు అదనంగా ధర లభించింది. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి గణేష్ మండపం నిర్వహకులు లడ్డూను అందించారు. ఆయనను శాలువాతో సత్కరించారు. లడ్డూ దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఉత్సవ కమిటీ సభ్యుడు కావడంతో ప్రస్తుతం లడ్డూను కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున ఇచ్చే విధంగా అందరి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేసి నిర్వహణ కమిటీకి ఇచ్చారు.

Balapur Ganesh Laddu Auction
Balapur Ganesh Laddu Auction

 

లడ్డూ వేలం పాటలో గత 27 ఏళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటోంది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట. 1994లో రూ.450 లతో మొదలైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట.. రాష్ట్రాంలో ఎక్కడాలేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. వేలంలో లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరి సంపదలతో పాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ లడ్డూ వేలంకు తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తొంది. 2001 వరకూ బాలాపూర్  లడ్డూకు వేలంలో వేలల్లోనే ధర పలకగా, 2002లో కందాడ మాధవరెడ్డి లక్షా 5వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుండి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది.

Balapur Ganesh Laddu Auction

 

2007 లో స్థానికుడు రఘునందనచారి రూ.4లక్షల 15వేలకు పాడుకుని దక్కించుకోగా ఆ తరువాత నుండి ఏటా రెండు లక్షలు పెరుగుతూ వచ్చింది. 2015లో ఏకంగా పది లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10లక్షల 32వేలకు లడ్డూను చేజిక్కించుకున్నారు. 2016లో ఏకంగా నాలుగు లక్షలు పెరిగింది. ఆ ఏడాది మెడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి రూ.14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నారు.  ఆ తర్వాత ఏడా లక్ష పెరుగుతూ 2021లో రూ.18లక్షల 90వేలకు చేరుకుంది. ఏపికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆయన స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డి (నాదర్గుల్) రూ.18లక్షల 90వేలకు చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.5లక్షల 70వేలు పెరిగింది. అయితే ఈ సారి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడే పోటీపడి రూ.24లక్షల 60వేలకు బాలాపూర్ లడ్డూ దక్కించుకోవడం జరిగింది.

రికార్డు సృష్టించిన మాదాపూర్ గణేష్ లడ్డూ వేలం .. ఎంతకు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju