న్యూస్

Balakrishna: 20 ఏళ్ల తర్వాత బాలయ్య మళ్లీ ఆ రికార్డు కొట్టాడు

Balayya akhanda balakrishna rare record
Share

Balakrishna: టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలు అందరూ- ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ అందుకున్న వాళ్లే. వీళ్ళందరి సినిమాలు ఏవి విడుదల అయినా పాజిటివ్ టాక్ వస్తే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ అవ్వాల్సిందే.

 

Balayya akhanda balakrishna rare record

సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ఈ ఫీట్ ను ఎప్పుడో అందుకున్నారు. అయితే బాలయ్య బాబు ఈ స్టార్స్ అందరికంటే చాలా ముందే ఈ ఫీట్ సాధించాడు.2001 లో ‘నరసింహ నాయుడు’ మూవీ విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్ళు అవుతుంది, అప్పట్లోనే సింగిల్ థియేటర్లో కోటి రూపాయల రాబట్టుకున్నాడు మన బాలయ్య బాబు.

బాలయ్య కెరీర్ లో ఒడిదుడుకులు వచ్చిన విషయం మన అందరికీ తెలిసినదే. ‘సింహ’, ‘లెజెండ్’ ఘనవిజయాలు అందుకున్నాయి కానీ సింగిల్ థియేటర్లో కోటి గ్రాస్ ని ఏ మాత్రం అందుకోలేక పోయాయి. ఇప్పుడు ‘అఖండ’ మూవీతో బాలయ్య ఈ ఫీట్ ను రిపీట్ చేశారు. ఈ సినిమా 100 కు పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ ఒకటి.

కోటి రూపాయల గ్రాస్ సినిమాలలో ‘అఖండ’ కూడా చేరింది. మొదటి వారంలోనే 70 లక్షలు దాకా వసూలు చేసిన ‘అఖండ’, వీకెండ్స్ లో తన సత్తా చూపుతూ వచ్చింది. ఇప్పుడు బాలయ్య కెరియర్లో 100 కోట్ల గ్రాస్ ను అందుకొని ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇలా 20 ఏళ్ల తర్వాత బాలయ్య బాబు మళ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.


Share

Related posts

Hair &amp: Beauty: జుట్టుకు, అందానికి ఈ పండు చాలు..!!

bharani jella

సాయి పల్లవి, కృతి శెట్టి ఆ స్టార్ హీరోయిన్స్ ఇద్దరినీ రీప్లేస్ చేయబోతున్నారా ..?

GRK

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar