Balakrishna : బాలయ్య బాబు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండుసార్లు హిందూపురం నియోజకవర్గం నుండి గెలవటం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా గెలిచిన గాని చాలావరకు నియోజకవర్గాలలో ప్రజలకు సంబంధించిన పనులు బాలయ్య అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అని టిడిపి పార్టీలోనే అంతర్గతంగా వినబడే టాక్. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా గాని బాలయ్యబాబు అందుబాటులో ఉండకుండా తన పీఏ చేత అన్ని పనులు చేయించడం జరుగుతుందని చెబుతుంటారు. అడపాదడపా నియోజకవర్గంలో పర్యటనలు తప్ప బాలయ్య బాబు పెద్దగా అందుబాటులో ఉండరన్న టాక్ ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో ఉంది. ఇలా ఉంటే త్వరలో బాలయ్య బాబు ఇక పూర్తిగా సినిమాలను పక్కన పెట్టి ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా రాణించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల హిందూపురం నియోజకవర్గ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపై బాలయ్యబాబు భారీ స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది. ఖచ్చితంగా పోరాటానికి దిగుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. అదే సమయంలో మంత్రి కొడాలి నాని పై కూడా మండిపడ్డారు. మరోపక్క తాజాగా ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్త తో ఫోన్ లో బాలయ్య బాబు భారీ స్థాయిలో డైలాగులు వేశారు. త్వరలో రోడ్డుమీదికి వస్తున్నట్లు సినిమాలను పక్కన పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందరూ రెడీగా ఉండాలని ప్రభుత్వం పై పోరాటానికి దిగాలని కోరారు. సో మొత్తంమీద చూసుకుంటే బాలయ్యబాబు మదిలో పొలిటికల్ గా పెద్ద స్కెచ్ ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క జమిలి ఎన్నికలు అనే దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్న క్రమంలో బాలయ్య బాబు కూడా రంగంలోకి దిగడంతో రాజకీయంగా దేశంలో పెను సంచలనాలు రాబోయే రోజులలో కలిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.