న్యూస్ సినిమా

ఆ చిన్న కారణం వల్ల ఏకంగా భర్తనే వదిలేసిన బాలయ్య హీరోయిన్..?

Share

సినిమా రంగంలో ఉన్న వాళ్లు కెరీర్, జల్సాలకు అలవాటు పడి వారి ఫ్యామిలీని పట్టించుకోరు. ఒక్కోసారి అలాంటి అలవాట్లు విడాకులు తీసుకునే వరకు వెళ్తాయి. అంతేకాకుండా ఒక్కోసారి వారిద్దరి మధ్య విభేదాలు, మాట పట్టింపులు కూడా విడాకులకు దారితీస్తాయి. ఇక 20 ఏళ్ల క్రితం టాలీవుడ్‌ సీనియర్ నటుడు సురేష్, అప్పటి నటి అనిత రెడ్డి ప్రేమ వివాహంలో కూడా ఇదే జరిగింది. ఆ వివాహ బంధం ఇద్దరి కెరీర్‌కి అడ్డుగా ఉందని వారు ఏకంగా విడిపోయారు.

ప్రేమ పెళ్లే కానీ నిలవలేదు

సురేష్ 1990లో ఐదారు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అనిత రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనిత రెడ్డి బాలకృష్ణతో కలిసి బాబాయ్ అబ్బాయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్ నటించింది. ఈ సినిమాకి జంధ్యాల గారు దర్శకత్వం వహించారు. అప్పట్లో సురేష్ అనిత కెరీర్ బాగుండటంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు సురేష్ కి సినిమా రంగంలో ఎక్కువ అవకాశాలు రాలేదు. అనిత కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకుంది. దానికి సురేష్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అనిత అమెరికా వెళ్లి పైచదువులు చదువుతోంది. ఇక్కడ చూస్తే పెళ్లయిన రెండు మూడు సంవత్సరాలో సురేష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయాడు. దాంతో సినిమాలు వదులుకొని అమెరికాకు వెళ్లడానికి అతను మనసు ఒప్పుకోలేదు.

అందుకే వదిలేసింది

అయితే అనితకు మాత్రం హీరోయిన్‌గా, సింగర్‌గా ఇండస్ట్రీలో మళ్లీ అడుగు పెట్టడం ఇష్టం లేదు. అలానే సురేష్ కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేకపోవడంతో వారిద్దరు కాంప్రమైస్ కాలేకపోయారు. అందరూ వీరికి ఒక బిడ్డ పుడితే మంచిగా సెటిల్ అవుతారని అనుకున్నారు కానీ వీరికి నిఖిల్ అనే కుమారుడు పుట్టిన కూడా ఎవరు కాంప్రమైజ్ కాలేదు. దాంతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. విడాకుల తర్వాత అనిత వేరేవాళ్లని పెళ్లి చేసుకుంది


Share

Related posts

Cancer : ఈ రకమైన క్యాన్సర్ చాల వేగం గా విస్తరిస్తోంది..ఇటువంటి  లక్షణాలు కనిపించగానే అలర్ట్ అవ్వాలి!!

Kumar

వివాదాలతో ఆగిన భారీ చిత్రం

Siva Prasad

అదిరిపోయిన `గాడ్ ఫాద‌ర్‌` టీజ‌ర్‌.. మెగా ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

kavya N