నందమూరి అభిమానులకు జోష్ ఇవ్వటానికి ముహూర్తం ఫిక్స్ చెయ్యబోతున్న బాలయ్య..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంక్రాంతి పండుగకు నందమూరి బాలయ్య ఏదో రీతిలో తన సినిమాని దింపి అదిరిపోయే హిట్ అందుకునే వాళ్లు. బాలయ్య బాబు నటించిన చాలా సినిమాలు సంక్రాంతి పండుగ నాడు రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ సారి సంక్రాంతి పండుగకు బాలయ్య మిస్ అవ్వడం జరిగింది.

Balakrishna as Aghora in Boyapati Srinu film - tollywoodవాస్తవానికి ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా కరోనా రాకపోయి ఉంటే సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసి రిలీజ్ చేసేవారు. కరోనా రావటం లాక్ డౌన్ దెబ్బకి షూటింగులు మొత్తం ఆగిపోవటంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇలాంటి తరుణంలో కొద్ది నెలల తర్వాత మళ్లీ ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇవ్వటంతో.. ప్రస్తుతం యధావిధిగా సినిమా షూటింగ్ లు  జరుగుతున్నాయి.

 

ఇటువంటి తరుణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య బాబు సినిమాకి సంబంధించి టీజర్ గాని పోస్టర్ గాని రిలీజ్ అవుతుందని అందరూ భావించగా నిరాశ ఎదురయింది. కానీ వచ్చే ఉగాది పండుగకు నందమూరి అభిమానులకు జోష్ నింపడానికి బాలయ్య బోయపాటి రెడీ అయినట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే వచ్చే ఉగాది పండుగ నాడు.. ఏకంగా సినిమా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి వీడియో రిలీజ్ చేసి అభిమానులను అలరించారు. ఆ వీడియోలు అదరగొట్టే మాస్ ఎలివేషన్ లో బాలయ్యని డైరెక్టర్ బోయపాటి చూపించడం జరిగింది.