రేపటి బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా ద్వారకా క్రియేషన్స్ వారు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ రోర్ పేరు తో రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెల్ల చొక్కా…. తెల్ల పంచ తో మాస్ లుక్ తో హడావిడి చేసిన బాలయ్య…. వైసిపి నేత కొడాలి నానికి కి టీజర్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అని ప్రజలు అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో కొడాలి నాని మీడియా వారి ముందు ” మా ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తాం అని మీకు ఎవరు చెప్పారు..? మీ అమ్మ మొగుడు చెప్పాడా?” అని మీడియా వారిని మరియు ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో చెప్పిన డైలాగ్ చూస్తే “ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో… శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనేదానికి…. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంది రా……..” అని బాలయ్య చెప్పడం విశేషం. ఇది కచ్చితంగా వైసీపీ పార్టీలోని కొడాలి నాని ని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ అని సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతోంది.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో గతంలో లెజెండ్ మరియు సింహా చిత్రాలు వచ్చాయి. ఆ రెండు భారీ హిట్ చిత్రాలలో కూడా బాలయ్య చెప్పిన డైలాగులు రాజకీయ పరమైన ఉద్దేశానికి చాలా దగ్గరగా ఉన్నాయి అని గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు బాలయ్య డైలాగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.