కరోనా ఎఫెక్ట్: కూరగాయలు అమ్ముతున్న ఫేమస్ డైరెక్టర్

కరోనా అందరి జీవితాలను మార్చేది. అందరి బతుకులను తారుమారు చేసింది. కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలమయింది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. చేతినిండా పనిలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో తెలియక కొందరైతే చివరకు కూలీలుగానూ మారుతున్నారు. మరికొందరు కూరగాయలు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.

balika vadhu director ram viriksha gaur sells vegetables
balika vadhu director ram viriksha gaur sells vegetables

అలా ఫేమస్ డైరెక్టర్ కూడా కరోనా వల్ల సినిమాలు లేక కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాడు. ఆయన ఎవరో కాదు.. బాలికా వధు సీరియన్ డైరెక్టర్.

అప్పట్లో బాలికా వధు సీరియల్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. కలర్స్ టీవీలో వచ్చిన ఈ సీరియల్.. ఫుల్లు ఫేమస్ కావడంతో దాన్ని తెలుగులోనూ డబ్ చేశారు. చిన్నారి పెళ్లికూతురు పేరుతో ఆ సీరియల్ తెలుగులో వచ్చింది.

balika vadhu director ram viriksha gaur sells vegetables
balika vadhu director ram viriksha gaur sells vegetables

ఆ సీరియల్ డైరెక్టరే ప్రస్తుతం కూరగాయలు అమ్ముకొని తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయన పేరే రామ్ వ్రిక్ష గౌర్. కరోనా వల్ల అవకాశాలు లేక.. జీవనం గడవడం కూడా కష్టంగా మారడంతో చేసేది లేక ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ లో కూరగాయలు అమ్ముకుంటూ రామ్ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

balika vadhu director ram viriksha gaur sells vegetables
balika vadhu director ram viriksha gaur sells vegetables

ఈ పని చేస్తున్నందుకు నాకేమీ సిగ్గుగా అనిపించడం లేదు. కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక.. ఇలా కూరగాయలు అమ్ముకుంటున్నా. షూటింగులు ప్రారంభం అయ్యేవరకు కూరగాయలే అమ్ముత. షూటింగ్ లు ప్రారంభమై.. మళ్లీ అంతా నార్మల్ స్థితికి వచ్చినప్పుడు మళ్లీ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా.. అని రామ్ చెప్పాడు.