NewsOrbit
న్యూస్

Balineni Srinivasa Reddy: జగన్ మంత్రివర్గంలో నూరు శాతం ప్రక్షాళన అంట..! బాంబ్ పేల్చిన ఆ మంత్రి..!!

Balineni Srinivasa Reddy: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల మూడు నెలలు అయ్యింది. మరో మూడు నెలల్లో మంత్రివర్గంలో ప్రక్షాళన జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మంత్రుల ప్రమాణ స్వీకారం రోజునే వైఎస్ జగన్ మంత్రుల పదవీ కాలాన్ని స్పష్టం చేశారు. దీంతో అప్పుడు మంత్రి పదవులు ఆశించిన వారు తరువాత అవకాశం లభిస్తుందని భావించారు. మంత్రివర్గ ప్రక్షాళన గడువు దగ్గర పడుతుండటంతో మంత్రులుగా ఉన్న వారిలో, మంత్రిపదవులు ఆశిస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. మంత్రివర్గంలో ఎందరు కొనసాగుతారు?. ఎవరు మాజీలు అవుతారు?. ఎవరికి అవకాశం లభిస్తుంది ? అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే క్రమంలో జగన్ మంత్రివర్గంలో 90 శాతం మందిని మార్పు చేస్తారని లేదు, 50 శాతం వరకూ మార్పులు చేర్పులు ఉండవచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి.

Balineni Srinivasa Reddy comments on ministers shuffling issue
Balineni Srinivasa Reddy comments on ministers shuffling issue

ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి దగ్గరి బంధువు కూడా అయిన ఓ మంత్రి పెద్ద బాంబ్ పేల్చారు. మంత్రి వర్గంలోకి నూరు శాతం కొత్త వారిని తీసుకోనున్నారని ఆ మంత్రి పేర్కొన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో ఇది జగన్మోహనరెడ్డి మనసులో మాట ఆయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి నుండి మంత్రులు మానసికంగా సిద్ధం అయ్యేందుకు ఈ లీక్ లు ఇచ్చారనే మాట కూడా వినబడుతోంది. పార్టీ విధాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కూడా బాలినేని..సీఎం జగన్ కు చెప్పారట. వైసీపీలోని 151 మంది ఎమ్మెల్యేలలో ప్రస్తుతం 25 మంది మంత్రులు ఉన్నారు. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరుగనుండటంతో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రిపదవులను ఆశిస్తున్నారు.

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

సీనియర్ లతో పాటు పలువురు జూనియర్ లు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణంలో ఉపయోగించుకుంటామని గతంలోనే జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 50 శాతం, 90 శాతం అంటూ వార్తలు రాగా బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకునే వారిని రాబోయే ఎన్నికల వరకూ కొనసాగిస్తారా లేక చివరి సంవత్సరంలో పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారా అనే దానిపై ఊహగానాలు సాగుతున్నాయి.

Read More:

1.MP Kesineni Nani: చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్..! ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి మరో నేతను ఎతుక్కోవాల్సిందేగా..?

2.AP CM YS Jagan: హస్తినకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! పర్యటన రద్దు చేసుకున్న ఏపి సీఎం జగన్..! కారణం ఏమిటంటే..?

3.Janasena – Tdp: టీడీపీ – జనసేన పొత్తు..? ఇదే సాక్షం..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?