NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు .. విడుదల.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా పామ్నూరు వద్ద ఆయన చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు నినాదాలు, నిరసనల మధ్య బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద నిన్న బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టగా నిరసన కారులపై పోలీసులు తొలుత నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత సెక్షన్లను మార్పు చేశారు. బీజేపీ నేతలపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని నిరస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

 

ఈ క్రమంలోనే స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూరు లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ దీక్ష చేపట్టగా పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు,. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి వాహనంలో తరలించారు. అనంతరం కరీంనగర్ లో బండి సంజయ్ ను వదిలిపెట్టారు.

మరో పక్క బండి సంజయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా సంస్థలు నివేదిక అందించాయి. దీంతో బండి సంజయ్ తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్ర పెద్దలు ఫోన్లో మాట్లాడారు. బండి సంజయ్ కు పోలీసులు భద్రత పెంచేందుకు సిద్దమవ్వగా బండి సంజయ్ స్థానిక పోలీసు భద్రతను తిరస్కరించారు. తెలంగాణ పోలీసులపై తనకు నమ్మకం లేదని కేంద్ర పోలీసు బలగాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియా సమావేశంలో కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్కడైతే తన పాదయాత్ర నిలుపుదల చేశారో అక్కడి నుండి మళ్లీ మెదలు పెడతానని పేర్కొన్నారు.

ఇదే విధంగా వివిధ ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నానన్నారు. సీఎం కేసిఆర్ అభద్రతా భావంతో ఉన్నారని అందుకే బీజేపి నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వినాాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా త్వరలోనే కేసిఆర్ కుటుంబం, ప్రజా వ్యతిరేక పాలన నుండి ప్రజలు విముక్తి కలుగుతుందని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju