తెలంగాణ‌ న్యూస్

గృహ నిర్బంధంలోనే బండి సంజయ్ .. నిరసన దీక్ష.. పాదయాత్రపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేతలు

Share

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి బండి సంజయ్ ఇంకా గృహ నిర్భంధంలోనే ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు వద్ద ధర్మ దీక్షకు దిగిన ఆయనను నిన్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను అక్కడి నుండి తరలించి కరీంనగర్ లోని నివాసం వద్ద వదిలివెళ్లారు. అక్రమ అరెస్టుల ను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు బండి సంజయ్. పలువురు బీజేపీ నేతలు ఆయన వెంట పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి వరకూ ఈ దీక్ష కొనసాగనున్నది. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద కు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

 

మరో వైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్ర ను నిలిపివేయాలని వరంగల్లు పోలీస్ కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర షెడ్యుల్ ప్రకారం కొనసాగించి తీరతామని బండి సంజయ్ పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే యాత్రకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పాదయాత్రను కొనసాగించేలా పోలీసులకు ఆదేశాలను జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం బీజేపీ నేతల పిటిషన్ పై విచారణ జరపనున్నది హైకోర్టు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వరంగల్లు పోలీసులు బిగ్ షాక్ .. పాదయాత్ర పై సందిగ్దత


Share

Related posts

ఘోర అవ‌మానం ఓ వైపు… కాంగ్రెస్ నేత‌ల `కొత్త‌` ప‌నులు ఇంకోవైపు!

sridhar

Eatela Rajendar : టీఆర్ఎస్ నేత‌లు ఉలిక్కిప‌డే కామెంట్లు చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌

sridhar

RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకి ఆచార్య వెనక్కి తగ్గుతున్నాడా..?

GRK