Maa Election’s: ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ పై సీరియస్ కామెంట్లు చేసిన బండి సంజయ్..!!

Share

Maa Election’s: టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికల్లో.. విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఓటమి చెందటం ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకుని కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో… ఇండస్ట్రీలో.. బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఫలితాలు వచ్చిన వెంటనే ఓటమిపాలైనటు తెలియటంతో నాగబాబు “మా” సభ్యత్వానికి రాజీనామా చేయటం.. మరింత వేడి పుట్టించింది. పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు ఉదయం ప్రకాష్ రాజ్.. మీడియా సమావేశం నిర్వహించి “మా” అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

బండి సంజ‌య్ త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ స్పంద‌న‌ | ap7am

తెలుగు వాడిగా పుట్టడం నా చేతిలో లేదని, నేనేం చేయలేను ఈ విషయంలో.. అయినాగానీ తెలుగు వాడిని గెలిపించినందుకు.. ఎన్నుకున్నందుకు.. అభినందనలు తెలిపారు. ఇక ఇదే సమయంలో “మా” అసోసియేషన్ కి సంబంధించి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు… నటుడిగా అందరితో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉండగా తన ఓటమి పై.. బండి సంజయ్, cvl నరసింహరావు వంటి వారు స్పందించటం పట్ల ప్రకాష్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Trivikram Should Teach Telugu To Prakash Raj: CVL Narasimha Rao -

బండి సంజయ్ ట్వీట్….

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. సోషల్ మీడియాలో “మా” ఎన్నికల పై స్పందించారు. గెలిచిన విష్ణు ప్యానల్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుతో సహా ప్యానెల్‌లోని విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేశారు. అలాగే.. జాతీయ వాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్‌కు మద్ధతిచ్చిన వారికి ‘మా’ ఎన్నికల్లో సరైన గుణపాఠం జరిగిందటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘వాస్తవానికి ‘మా’ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. ‘మా’ ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు.’’ అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. గతంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ వ్యవహరించడం జరిగింది. దీంతో వాటిని దృష్టిలో పెట్టుకుని.. తాజాగా ప్రకాష్ రాజ్ ఓటమిపై బండి సంజయ్ రియాక్ట్ అయినట్లు అందరూ భావిస్తున్నారు.


Share

Related posts

ఎప్పుడో మొదలైన పుష్ప మీద నమ్మకం లేదు ..అసలు మొదలే కాని సర్కారు వారి పాట మాత్రం పక్కా నా ..?

GRK

DRDO Job Notification : డి‌ఆర్‌డిఓ లో ఖాళీలు..!!

bharani jella

పడవ బోల్తా:8మంది మృతి

somaraju sharma