తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ టైం లో కేసీఆర్ అడ్రస్ లేకుండా పోయారు అంటూ బండి సంజయ్ వైరల్ కామెంట్స్..!!

Share

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మహమ్మారి కరోనా వచ్చిన సమయంలో రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయారని, ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు.

New Telangana BJP chief Bandi Sanjay has his task cut out- The New Indian  Expressకానీ మోడీ లాక్ డౌన్ కి పిలుపునిస్తే దేశ ప్రజలంతా అండగా ఉన్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా అధికారం కోసం ఎగబడ్డ లేదని, అధికారం కావాలని కోరుకోలేదని, అధికారం కోసం ఎప్పుడూ పని చేయలేదని బండి స్పష్టం చేశారు. కాని కొంత మంది అమరవీరుల త్యాగం వల్ల నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ఇష్టానుసారం అయిన పాలన అందిస్తున్నారని ప్రజలను గాలికొదిలేశారని బండి సంజయ్ సీరియస్ కామెంట్లు చేశారు.

 

కానీ దేశ ప్రధాని మోడీ కరోనా ని ఎదుర్కోవటానికి ముందస్తుగా ప్రజలందరినీ అప్రమత్తం చేసి లాక్ డౌన్ చేపట్టి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సహకరించారని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రం నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

‘పెంగ్విన్ ‘లెక్కలు తారుమారు ! తెగ చూసేస్తున్నారు !!

Yandamuri

Srilakshmi : రావమ్మా శ్రీలక్ష్మి! జగన్ సిఎస్ చేసుకోవడానికి చూస్తున్నారా??

Comrade CHE

Irregular Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా..!? ఇలా ట్రై చేసి చూడండి చాలు..!! 

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar