Bank Holidays: మనలో చాలా మందికి ప్రతి రోజూ కాకపోయినా, నెలలో ఓ రెండు మూడు సార్లైనా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం రావచ్చు. మనం తీరా వెళ్లిన రోజు అక్కడ బ్యాంకుకి సెలవు అని తెలిస్తే, సమయం.. శ్రమ రెండూ వృధానే. అందుకే సదరు బ్యాంక్స్ తన కస్టమర్లకు ముందుగానే ఒక నోటిస్ ఇస్తుంది. ఒకప్పుడు ఈ నోటీసులు జనాలకి అంతగా తెలిసేవి కావు. అప్పుడున్న సౌకర్యాలు అలాంటివి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరి చేతిలో ఇపుడు స్మార్ ఫోన్ వుంది. అందువలన కస్టమర్, సమాచారాన్ని తెలుసుకోవడం చాలా తేలిక.
ఏయే రోజుల్లో బ్యాంకులు సెలవు?
మన దేశవ్యాప్తంగా వున్న ప్రభుత్వ బ్యాంకులకు రేపటి నుంచి సెలవులు ఉన్నాయి. కాగా బ్యాంక్ యూనియన్లు 2 రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 16, 17 అంటే రేపు ఎల్లుండి తేదీల్లో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగనున్నాయి. వీటికి కారణం మనకు తెలిసినదే.. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగుతున్నాయి. దీని వల్ల బ్యాంకుల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇక బ్యాంకులు ఏ ఏ రోజుల్లో పని పనిచేయవంటే.. డిసెంబర్ 16, (బ్యాంక్ యూనియన్ల సమ్మె) డిసెంబర్ 17, (బ్యాంక్ యూనియన్ల సమ్మె) డిసెంబర్ 18, (యు సోసో థామ్ వర్ధంతి) డిసెంబర్ 19. (ఆదివారం)
సమ్మె గురించి తెలుసుకుందాం:
ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం అనే విధానంపై యూనియన్లు మండిపడుతున్నాయి. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉందని వారు అంటున్నారు. అందువలనే దానికి నిరసనగా సమ్మెకు పిలుపు ఇచ్చామని AIBOC (ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్) జనరల్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ దాస్ పేర్కొన్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), PNB (పంజాబ్ నేషనల్ బ్యాంక్), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBL బ్యాంక్లు సర్వీసులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సమాచారం.