Bank Holiday: వరుసగా బ్యాంకులకు 6 రోజులు సెలవులు ..!

Share

Bank Holiday: బ్యాంకు పనులు ఉంటే ముందే చేసుకోండి. ఎందుకంటే నవంబర్ (November) నెలలో వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఎటువంటి బ్యాంకు లావాదేవీలైనా బ్యాంకుల సెలవులకు ముందుగానే చేసుకుంటే ఆ సమయంలో ఇబ్బంది పడకుండా హాయిగా ఉండవచ్చు. లేకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు బ్యాంకులు పని చేయవంటే కొంత మంది గాబరా పడిపోతారు. మరి బ్యాంకులు ఏ రోజుల్లో పని చేయవనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటే..


Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా మీ కోసం…!
ఆన్‌లైన్ బ్యాంకింగ్ మీద అవ‌గాహ‌న లేని వారికి ఇబ్బంది..

ఇప్పుడు ఆన్ లైన్ బాగా వృద్ధి చెందడంతో పలువురు వినియోగదారులు ఎటువంటి పనులైనా సరే ఆన్ లైన్ బ్యాంకింగ్ ను ఉపయోగించి చక్కబెట్టుకుంటున్నారు. కానీ ఆన్ లైన్ బ్యాంకింగ్ మీద పెద్దగా అవగాహన లేని కస్టమర్లు మాత్రం ఇప్పటికీ బ్యాంకు బ్రాంచులనే నమ్ముకుంటారు. అటువంటి వారు బ్యాంకు సెలవుల(Bank Holidays) గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.

నవంబర్ 19న ఈ రోజు గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి కావున బ్యాంకులు పని చేయవు.
నవంబర్ 21 ఆదివారం కాబట్టి బ్యాంకులకు సెలవు.
నవంబర్ 22 ఈ రోజు కనకదాస్ జయంతి కావున బెంగుళూరులోని బ్యాంకులు పని చేయవు.
నవంబర్ 23న సెంగ్ కుత్ స్నేమ్ కావున షిల్లాంగ్ లోని పలు బ్యాంకులు పని చేయవు.
నవంబర్ 27 నాలుగో శనివారం కావున బ్యాంకులకు హాలీడే.
నవంబర్ 28 ఆదివారం.
Bank New guidelines: ఆగస్టు ఒకటి నుండి అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే..?

ఆన్‌లైన్ సేవ‌లు అందుబాటులోనే…

పై రోజుల్లో బ్యాంకులు పని చేయవు కాబట్టి ముందుగానే బ్యాంకుల్లో పనులు ఏవైనా ఉంటే చేసుకోవడం ఉత్తమం. లేదంటే తరువాత ఇబ్బందులు పడతారు. బ్యాంకులు సెలవు ఉన్నా కానీ ఈ రోజుల్లో మాత్రం ఆన్ లైన్ బ్యాంకింగ్ (online banking) సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. కావున ప్రతి ఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఎంచుకోవడం అత్యుత్తమం


Share

Related posts

Mobile phones మొబైల్ ని అలారం గా వాడుతున్నారా?? అయితే  ఇది  తెలుసుకోండి!!

Kumar

ముఖ్యమయిన పనులు మీద వెళ్లే టప్పుడు ఇలా చేసి వెళ్ళండి…తప్పకుండా పనులు జరుగుతాయి.

Kumar

కరోనాతో వీరికి గుడ్ న్యూస్

bharani jella