Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! వచ్చే ఏడాది బ్యాంకు సెలవులు అన్ని రోజులా?

Share

Banking Services: మనలో ఎవరో ఒకరు తరచూ లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్తూ వుంటారు. అందువలన మనం బ్యాంక్స్ ఎప్పుడు వుంటాయో, ఎప్పుడు ఉండవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల వివరాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బ్యాంకులకు ఎన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. మనం చూస్తుంటాం.. బ్యాంకు ఉద్యోగులకు ఏస్థాయిలో ఒత్తిడి ఉంటుందో. అందువలన వారికి ఈ సంవత్సరం కాస్త ఉపశమనమే అని చెప్పుకోవాలి.

ఎన్ని సెలవులు? ఎప్పుడెప్పుడు వున్నాయి?

అయితే ఈ సెలవుల్లో పండుగలు, పబ్బాలు వంటివి కూడా ఇమిడి వున్నాయి. ఇక ఎప్పుడో ఒకప్పుడు బందులు లాంటివి కూడా వుంటూవుంటాయి. దాంతో ఈ సంవత్సరం దండిగా సెలవులు వున్నట్టు తెలుస్తోంది. అందుకే మీరు కూడా ఈ సెలవుల వివరాలు తెలుసుకొని మీ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. బ్యాంకులకు ఈ 2022 సంవత్సరంలో మొత్తం 17 సాధారణ సెలవులు వున్నాయి. ఇక ఇవి కాకుండా ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో వచ్చే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు వున్న విషయం తెలిసినదే.

కస్టమర్లు బ్యాంకులకు వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసుకోండి…

బ్యాంకు వారికి సెలవులు ప్రతీ నెలలో 6 లేదా 7 ఉంటాయి కాబట్టి ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకుతో పని లేకుండా చాలావరకు లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకొనేలా ప్రణాళిక చేసుకుంటే సరిపోతుంది. NEFT, IMPS, RTGS, UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవలు సెలవులతో సంబంధం పని చేస్తాయి కనుక కస్టమర్లు ఈ సేవల్ని ఉపయోగించుకొని లావాదేవీలు జరపొచ్చు.


Share

Related posts

బాలయ్య బోయపాటి సినిమాలో సోనూసూద్..ఇక ధియోటర్లు బద్దలైపోవలసిందే..

GRK

‘ వి ‘ సినిమా రిజల్ట్ ఆ స్టార్ హీరో సినిమా మీద పడుతుందన్న భయం మొదలైందా..?

GRK

Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!

bharani jella