ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు జనాలు బ్యాంకులనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఎలాగంటే డబ్బును ఫేస్ గా ఉంచడం నుంచి రుణం పొందటం వరకూ ప్రజలు బ్యాంకులకు ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. అత్యాధునిక టెక్నాలజీతో బ్యాంకులు కూడా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. అయితే రోజూ వారిగా బ్యాంకుల్లో తమ లావాదేవీలను కొనసాగిస్తుంటారు చాలా మంది. మరి ఇప్పుడివెందుకని మీరనుకుంటున్నారేమో..
దానికీ కారణం ఉందండోయ్.. మరి మీకెమైనా బ్యాంకులో ఎలాంటి పనైనా మిగిలుందా.. అయితే మీ పనులను బ్రేక్ పడినట్టేనండోయ్.. ఎందుకంటారా.. మరే బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయండోయ్.. హా అదేంటి పండగలప్పుడేగా బ్యాంకులకు సెలవులు అనుకుంటున్నారా.. హా అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.. అయితే వీటి గురించి క్లారిటీ ఇవ్వడానికే బ్యాంక్ కస్టమర్ల కోసం ఈ అలర్ట్..
అయితే నవంబర్ 15 న ఆదివారం కావడంతో ఆ రోజు బ్యాంకులకు సెలవుదినం అని అందరికీ తెలిసిందే.. కాగా నవంబర్ 16 న కూడా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించేశారు. ఎందుకంటే బలిప్రతివద లేదా లక్ష్మిపూజ లేదా విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ ఇందుకు గల కారణాలు. ఇదే కాక ఇంకా కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 20, 21 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఎందుకంటే చత్ ఫెస్టివల్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే నవంబర్ 22 న ఆదివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు.
అంటే వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవులన్న మాట.. అలాగే నవంబర్ 28 న నాలుగో శనివారం రావడంతో ఆ రోజూ బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత ఇలాగు ఆదివారం రావడంతో ఆ రోజూ బ్యాంకులకు సెలవు. అలాగే నవంబర్ 30 న గురు నానక్ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు. ఇంకేముంది బ్యాంకులకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవు దినాలు వచ్చేశాయి. ఇక కస్టమర్లు కూడా బ్యాంకులకు సెలవు దినాలను గమనంలో ఉంచుకుని బ్యాంకులకు వెళ్లండి.