Bank Holidays: మీరు బ్యాంకుకి తరచుగా వెళ్తుంటారా? నవంబర్ నెలలో బ్యాంకు పనుల కోసం షెడ్యూలు ఏర్పరుచుకున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. సాధారణంగా బ్యాంకులు ఆదివారాల్లో పాటు నెలలో 2, 4వ శనివారం రోజుల్లో మూసివేసి ఉంటాయి. అయితే పండుగలు వంటి ప్రత్యేక దినాల కారణంగా బ్యాంకులను మిగతా రోజుల్లో కూడా మూసివేస్తారు. నవంబర్ నెలలో కూడా ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎప్పుడు సెలవులు లభించాయో ఇప్పుడు తెలుసుకుందాం.
BANK HOLIDAYS : సెప్టెంబర్లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయంటే…?
నవంబర్ లో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు:
నవంబర్ 4 – దీపావళి/ కాళీ పూజ ( తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ప్రాంతాల్లో సెలవులు)
నవంబర్ 7 – ఆదివారం
నవంబర్ 13 – రెండో శనివారం
నవంబర్ 14 – ఆదివారం
నవంబర్ 19 – గురునానక్ జయంతి/కార్తిక పూర్ణిమ
నవంబర్ 21 – ఆదివారం
నవంబర్ 27 – నాలుగో శనివారం
నవంబర్ 28 – ఆదివారం
పై సెలవులు ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ తేదీలను గుర్తుపెట్టుకుని మీ తదుపరి బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోండి. కన్నడ రాజ్యజోత్సవం, ఛత్ పూజా వంటి లోకల్ పండుగల ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.
ఈ సెలవులు మన తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. అందువల్ల మొత్తంగా 17 సెలవులు ప్రకటించినా.. వాటిలో కేవలం ఎనిమిది సెలవులు మాత్రమే మన తెలుగు రాష్ట్రాల బ్యాంకులకు వర్తిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో 17 రోజుల పాటు సెలవులు అని ప్రచారం జరుగుతుంది. కానీ కేవలం ఎనిమిది రోజులపాటు మాత్రమే సెలవులు ఉంటాయనేది ఖాతాదారులు గమనించాలి.