ఈసారి 287 డిజైన్లతో సరికొత్తగా బతుకమ్మ చీరలు.. ఆరోజు నుంచి అందరికీ పంపిణీ

bathukamma sarees in telangana will be distributed from october 9
Share

తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ కానుక బతుకమ్మ చీరలు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంప్రదాయంగా, గౌరవంగా పూలను పూజించే పండుగ బతుకమ్మ. అందులోనూ తెలంగాణ అధికారిక పండుగ బతుకమ్మ కావడంతో… తెలంగాణ ప్రభుత్వం తన ఆడపడుచులకు బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తోంది.

bathukamma sarees in telangana will be distributed from october 9
bathukamma sarees in telangana will be distributed from october 9

గత నాలుగేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు చీరలను కానుకగా ఇస్తోంది. నాలుగేళ్లలో సుమారు నాలుగు కోట్ల చీరలను ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసింది.

అయితే.. ఈసారి మాత్రం బతుకమ్మ చీరలను వెరైటీగా డిజైన్ చేశారు. మొత్తం 287 డిజైన్లతో సరికొత్తగా ఈసారి చీరలను తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పలు రకాల డిజైన్లతో పాటుగా.. బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేయించారు. సిరిసిల్ల నేత కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం ఈ చీరలను తయారు చేయించింది.

ఇప్పటికే చీరలను తయారు చేయడం పూర్తవడంతో వచ్చే నెల అంటే అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది.

ఇక.. వచ్చే నెల 17 నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే.. బతుకమ్మ పండుగ సమయానికి ఆడపడుచులందరికీ చీరలు అందుతాయి.

అయితే.. ఈ సారి కరోనా వల్ల మహిళల ఇంటికే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామంలో ఉన్న ఆడపడుచులకు ఇంటింటికి వెళ్లి చీరలను పంపిణీ చేస్తారు.


Share

Related posts

Sakshi Agarwal Latest Photos

Gallery Desk

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

somaraju sharma

Pillows: ఒకే తలగడను ఉపయోగిస్తున్నారా..!? ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే..!!

bharani jella